వాల్తేరు వీరయ్య రవితేజ వల్లే ఆడిందట.. ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు వైరల్!

మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) రీఎంట్రీలో వరుసగా సినిమాలలో నటిస్తున్నా ఈ సినిమాలలో మెజారిటీ సినిమాలు ఆశించిన ఫలితాలను అందుకోవడం లేదు.యంగ్, టాలెంటెడ్ డైరెక్టర్ల డైరెక్షన్ లో చిరంజీవి నటిస్తున్నా మెజారిటీ సినిమాలు భారీ నష్టాలను మిగుల్చుతున్న నేపథ్యంలో చిరంజీవి కథల, డైరెక్టర్ల ఎంపికలో జాగ్రత్త పడాలని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

 Rgv Sensational Comments About Walteir Veeraiah Bhola Shankar Movies Details He-TeluguStop.com

భోళా శంకర్( Bhola Shankar ) సినిమాకు భారీ నష్టాలు ఖాయమని ఇప్పటికే తేలిపోయింది.

సినిమాలో చిరంజీవి అద్భుతంగా నటించినా అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ సినిమా ఆకట్టుకోలేదు.

తల, తోక లేని కథనం, మౌత్ టాక్ పూర్తిస్థాయిలో నెగిటివ్ గా ఉండటం గమనార్హం.భోళా శంకర్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ రిజల్ట్ ను సొంతం చేసుకోవడం ఖాయమని తేలిపోయింది.

ఊహించని స్థాయిలో డిజాస్టర్లు తీసిన ఆర్జీవీ సైతం వాల్తేరు వీరయ్య, భోళా శంకర్ సినిమాలను ప్రస్తావిస్తూ షాకింగ్ ట్వీట్ చేశారు.

Telugu Bhola Shankar, Chiranjeevi-Movie

“వాల్తేరు వీరయ్య ఎవరి మూలాన ఆడిందో ప్రూవ్ చేయడానికి తీసినట్టుంది భోళా శంకర్” అని వర్మ తన ట్వీట్ లో పేర్కొన్నారు.వాల్తేరు వీరయ్య( Waltheru Veeraya ) సక్సెస్ కు రవితేజ కారణమనేలా వర్మ పరోక్షంగా ట్వీట్ చేశారు.ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతుండగా నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మెగా ఫ్యాన్స్ మాత్రం భోళా మూవీ ఆశించిన ఫలితాన్ని అందుకోకపోవడంతో ఫీలవుతున్నారు.

Telugu Bhola Shankar, Chiranjeevi-Movie

సరైన ప్రాజెక్ట్ లపై దృష్టి పెడితే చిరంజీవి మళ్లీ సక్సెస్ ట్రాక్ లోకి రావడం కష్టం కాదు.వీకెండ్ లో కూడా ఈ సినిమా బుకింగ్స్ ఆశించిన విధంగా లేకపోవడం ఫ్యాన్స్ ను బాధ పెడుతోంది.హైదరాబాద్ లోని మెజారిటీ థియేటర్లలో భోళా శంకర్ బుకింగ్స్ దారుణంగా ఉన్నాయి.

చిరు కెరీర్ లో భారీ నష్టాలను మిగిల్చిన సినిమాల జాబితాలో భోళా శంకర్ ముందువరసలో ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube