సినిమా ఫ్లాప్ అయినా వాణిశ్రీ కట్టిన ఆర్గాండి వాయిల్ చీరలు ఫుల్ ఫేమస్

సాధారణంగా సినిమాలో హీరో, హీరోయిన్లు ధరించే డ్రెస్సులను ప్రజలు బాగా ఇష్టపడతారు.అలాంటి వాటినే కొనుగోలు చేయాలని పడుకుంటారు కాబట్టి ఆ రకం వస్త్రాలకు చాలా డిమాండ్ పెరిగిపోతుంది.

 Vanisri Organdy Voile Sarees Full Famous Even Though Movie Flops Details, Vanisr-TeluguStop.com

అయితే 1974లో వచ్చిన చక్రవాకం( Chakravakam ) సినిమాలో వాణిశ్రీ( Vanisri ) కట్టిన చీరలకు మగువలు ఫిదా అయిపోయారు.ఈ సినిమాకి దర్శకుడు విక్టరీ మధుసూధనరావు.

ఈ మూవీ క్లైమాక్స్ సీనులో పడవ నడిపే వ్యక్తిగా ఈ డైరెక్టర్ కనిపించి ఆశ్చర్యపరిచాడు.డి.

రామానాయుడు ఈ సినిమాకి నిర్మాత అంతేకాదు.ఈ సినిమాలో ఫుల్ లెంగ్త్ రోల్ చేసి తనలోని నటనా నైపుణ్యాలను ప్రదర్శించారు.

కోడూరి కౌసల్యాదేవి “చక్రవాకం” పేరుతో ఒక నవల రాశారు.ఆ నవల బాగుండడంతో ఆ కథతోనే చక్రవాకం మూవీ తీశారు.ఈ సినిమా పెద్దగా ఆడలేదు కానీ ఇందులో వాణిశ్రీ కట్టిన చీరెల( Vanisri Sarees ) చాలామంది మగువల మనసుల దోచేశాయి.వీటిని “ఆర్గండి/ఆరగండి వాయిల్ చీరెలు”( Organdy Voile Sarees ) అంటారు.

బంగారు బాబు మూవీ తర్వాత గోల్డ్ స్పాట్ కలర్ శారీలు , వోణీలు బాగా అమ్ముడుపోయాయి.చక్రవాకం సినిమా విడుదలయ్యాక చక్రవాకం చీరలకు క్రేజ్ బాగా పెరిగిపోయింది.

విమల్ వాయిల్ చీరల్నే చక్రవాకం చీరలు అంటూ బట్టల షాపు వాళ్లు శారీ సేల్స్ బాగా పెంచుకోగలిగారు.వాణిశ్రీ కట్టిన శారీలు అప్పట్లో కొత్త ఫ్యాషన్‌ క్రియేట్ చేశాయి.

Telugu Chakravakam, Organdyvoile, Ramanaidu, Sobhan Babu, Vanisri, Vanisriorgand

చక్రవాకం సినిమా “బంగారు కలలు” సినిమా లాగానే బోరింగ్ గా ఉంటుంది అందువల్ల అది ఆడవారికి సైతం రుచించలేదు.చక్రవాకం అనేది కర్ణాటక మ్యూజిక్ లో ఒక రాగం.ఆ రాగంలో వాణిశ్రీ ఒక అద్భుతమైన పాట పాడినట్లు తీశారు.నిజానికి ఆ పాటను గాన కోకిల సుశీలమ్మ( Legendary Singer Susheela ) చాలా గొప్పగా ఆలపించారు.“వీణ లోనా తీగె లోనా ఎక్కడున్నదీ రాగము” చింటూ సాగే ఈ పాట చాలా మెలోడీస్ గా ఉంటుంది.మిగిలిన పాటలు కూడా హృదయాన్ని తాకుతాయి.“నదిలా నా హృదయం పరుగులు తీస్తుంది” , “కొత్తగా పెళ్ళైన కుర్రవానికి పట్టపగలె తొందరా” పాటలు అప్పట్లో హిట్స్ కూడా అయ్యాయి.రామకృష్ణ సుశీలతో కలిసి ఈ పాటలను పాడారు.

కె వి మహదేవన్ మ్యూజిక్ కంపోజ్ చేశారు.

Telugu Chakravakam, Organdyvoile, Ramanaidu, Sobhan Babu, Vanisri, Vanisriorgand

ఇందులో శోభన్ బాబు ( Sobhan Babu ) హీరోగా నటించారు.అతనికి తల్లిదండ్రులుగా నాగభూషణం , జి వరలక్ష్మిలు కనిపించిన మెప్పించారు.పెద్దన్నగా రామానాయుడు ఓ మంచి వేషం వేశారు.

రామానాయుడు భార్యగా కృష్ణకుమారి నటించారు కానీ ఆమెకు అయిదారు డైలాగులు మాత్రమే ఇచ్చారు.పద్మనాభం, రాజసులోచన దంపతులుగా కనిపించారు.

చంద్రకళ , శ్రీధర్, SVR , అంజలీదేవిలు లాంటి దిగ్గజ నటీనటులు కూడా ఇందులో నటించారు.అల్లు రామలింగయ్య చక్కని కామెడీ పండించారు.

ఈ సినిమా ఇప్పటికీ యూట్యూబ్‌లో ఉంది.వాణిశ్రీ కట్టిన చీరలు ఎంత అందంగా ఉన్నాయో తెలుసుకోవాలంటే ఈ మూవీని చూడొచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube