నీకు నోరు ఊరుకోదు..నెటిజన్స్ స్క్రోలింగ్ ఆపరు.. ఎందయ్య మాకు ఈ కర్మ

స్టార్ హీరో సిద్ధార్థ్( Siddharth ) పర్సనల్ లైఫ్‌లో చాలా వివాదాలు ఫేస్ చేశాడు.ఎన్నో కష్టాలను కూడా ఎదుర్కొన్నాడు.

 Hero Siddharth Again In Controversy Details, Siddharth, Hero Siddharth, Siddhart-TeluguStop.com

ఇక సోషల్ మీడియాలో అతడిని చాలా తరచుగా టార్గెట్ చేస్తుంటారు.సిద్ధార్థ్ చేసే కొన్ని వ్యాఖ్యలు ట్రోలింగ్‌కు దారితీస్తుంటాయి.

మెచ్యూరిటీ లేక అతను అలాగే కామెంట్లు చేస్తుంటారు.నెటిజన్లు అతన్ని ట్రోలింగ్ చేస్తూనే ఉంటారు.

ఇది ఎప్పుడూ జరిగేదే.తాజాగా మరోసారి అతడు టీ20 క్రికెట్‌పై( T20 Cricket ) వ్యాఖ్యలు చేశాడు.

ఇంకేముంది, అతడిని నెటిజన్లు ఆడుకోవడం ప్రారంభించారు.నిజానికి ఈ వ్యాఖ్యలపై ట్రోలింగ్ చేయాల్సిన అవసరం లేదు.కానీ కొద్ది కొద్దిగా అతనిపై పెరిగిపోయిన నెగటివిటీ కారణంగా అతను ఏం చెప్పినా కూడా ఇప్పుడు తప్పే అయిపోతుంది.

ఇండియన్-2( Indian 2 ) ప్రమోషన్ గురించి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ హీరో మాట్లాడుతూ ‘‘ప్రజెంట్ జనరేషన్ క్రికెట్ ఫ్యాన్స్‌కు వీవీఎస్ లక్ష్మణ్( VVS Laxman ) ఎవరో తెలియదు.ఒక జనరేషన్ ముందు లక్ష్మణ్ ఓ గొప్ప క్రికెటర్, ఇప్పుడు ఫ్యాన్స్ టీ20 ఒక్కటే అసలైన క్రికెట్ అనుకుంటూ చూస్తున్నారు కానీ అసలు ఆట అది కాదు, అది ఒక ఎంటర్‌టైన్‌మెంట్‌’’ అని అన్నాడు.ఇండియన్ 2 మూవీ ప్రమోషన్‌కూ, క్రికెట్ సబ్జెక్టుకూ ఎలాంటి లింకు లేకపోయినా అతను అనవసరంగా దీని గురించి మాట్లాడాడు.

ప్రజలు ఇప్పుడు చాలా బిజీ అయిపోయారు.గంటల తరబడి కూర్చుని క్రికెట్ మ్యాచ్లు చూసేంత టైం, ఓపిక ఎవరికీ ఉండడం లేదు.

Telugu Cricket, Siddharth, Indian, Kamal Haasan, Shankar, Vvs Laxman-Movie

అభిరుచులు కూడా మారాయి.అందువల్ల టీ20ని ఇష్టపడుతున్నారు.అందులో పెద్దగా తప్పేం లేదు.ఒకరి టేస్ట్ ని మనం తప్పు పట్టలేం.

అలాగని ఒకరి అభిప్రాయాన్ని కూడా మనం ఎగతాళి చేయాల్సిన అవసరం లేదు.టెస్ట్ క్రికెటే( Test Cricket ) అసలు ఆట, టీ20 ఆటే కాదు అని సిద్ధార్థ్ చెప్పడం అతని ఇష్టం.

అది ఏ సందర్భంలో చెప్పాడనేది కూడా అప్రస్తుతం.ఈ మాటలు అతను చెప్పడం వల్ల తప్పు బట్టాల్సిన అవసరం లేదు.

కానీ సిద్ధార్థ్ పైన చాలా నెగెటివిటీ ఉంది కాబట్టి “టీ20 కప్‌ విన్ అయినా ఇండియా విజయాన్ని అతను చులకన చేసి మాట్లాడుతున్నాడు” అంటూ చాలామంది ఏకి పారేస్తున్నారు.

Telugu Cricket, Siddharth, Indian, Kamal Haasan, Shankar, Vvs Laxman-Movie

అతడి పెళ్లిళ్లు పెటాకులు కావడం గురించి కూడా మాట్లాడుతున్నారు.లవ్‌ అఫైర్స్‌ గురించి కూడా ప్రస్తావిస్తున్నారు.సిద్ధార్థో మోసగాడు అంటూ తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు.

మాయ మాటలు చెప్పి యువ హీరోయిన్లను బుట్టలో వేసుకోవడం తప్పితే నీకేం తెలుసు అన్నట్లు కూడా మాట్లాడుతున్నారు.నిజానికి ఇవేమీ మాట్లాడాల్సిన అవసరం లేదు.

అతడు తనకు క్రికెట్( Cricket ) మీద ఉన్న ఒక అభిప్రాయం గురించి మాట్లాడాడు.ఆ అభిప్రాయానికి, అతని లవ్ అఫైర్స్ కి ఎలాంటి సంబంధం లేదు.

అలాంటప్పుడు వాటిని మళ్లీ తెరపైకి తీసుకొచ్చి విమర్శించడం ఎందుకు అని న్యూట్రల్ వ్యక్తులు కామెంట్లు చేస్తున్నారు.సిద్ధార్థ ఇండియన్ 2 సినిమాలో నటించాడు.

ఆయనపై ఉన్న నెగెటివిటీ వల్ల ఈ సినిమాకి కాస్త నష్టం కలిగించే అవకాశం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube