వేణుమాధవ్ కారణంగానే ఆ రాజమౌళి సినిమా హిట్..??

ఒకప్పుడు ముందుగా రెడీ చేసుకున్న స్క్రిప్ట్ ప్రకారమే దర్శకులు సినిమాలు తీసేవారు కానీ ఈ పద్ధతి కాలక్రమేణా పూర్తిగా మారిపోయింది.ఇప్పుడు సినిమా మధ్యలో, సినిమా అయిపోయిన తర్వాత కూడా స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులు చేస్తున్నారు.

 Rajamouli Hit Movie Due To Venu Madhav Details, Rajamouli, Venu Madhav, Comedian-TeluguStop.com

సీన్లను కొత్తగా యాడ్ చేస్తున్నారు.పాటలను కూడా జోడించేస్తున్నారు.

అవసరం లేని సన్నివేశాలను కట్ చేస్తున్నారు.ఇలా మార్పులు చేర్పులు చేయడం ద్వారా బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టిన వారు ఎందరో ఉన్నారు.

అలాంటి వారితో రాజమౌళి( Rajamouli ) కూడా ఒకరు.దివంగత కమెడియన్ వేణుమాధవ్( Venu Madhav ) రాసిన సీన్లను రాజమౌళి తన “సై” సినిమా( Sye Movie ) కోసం వాడుకున్నారు.

నిజానికి వేణుమాధవ్ చాలా టాలెంటెడ్.ఎలాంటి సన్నివేశాన్నైనా సింగిల్ టేక్ లో ఫినిష్ చేస్తాడు.

అంతేకాదు తాను నటించే సినిమాలకు సొంతంగా కామెడీ ట్రాకులను కూడా రాసుకుంటాడు.అలాంటి కామెడీ ట్రాకులను( Comedy Tracks ) రాజమౌళి “సై” సినిమా కోసం కూడా రాసుకున్నాడు.

ఈ సినిమాలో కాలేజీ స్టూడెంట్స్, వేణుమాధవ్ మధ్య వచ్చే సీన్లు బాగా హైలైట్ అయ్యాయి.వీటిని వేణుమాధవ్ సొంతంగా రాశాడు.ఈ సన్నివేశంలో వేణుమాధవ్ ఎలక్షన్ల క్యాంపెయిన్‌లో భాగంగా గోడలపై రాజకీయ అభ్యర్థుల పేర్లు రాయిస్తుంటాడు.ఈ సీన్‌లో రాజమౌళి కూడా కనిపిస్తాడు.

Telugu Venu Madhav, Nithin, Rajamouli, Sye, Venu Madhav Sye-Movie

రాజమౌళి వచ్చి ‘అన్నా గోడలమీద రాయనీకి పర్మిషన్‌ కావాల్నంటనే.’ అని సిగరెట్ తాగుతున్న వేణుమాధవ్ వద్దకు వచ్చి అంటాడు.దాంతో ‘పర్మిషనేందిరో.గోడల మీద కాదురా.గుండెల్లో కునుకు తీస్తా.మన పేరు చెప్తే కాలేజీకి లాంగ్‌ బెల్‌ కొట్టాలి.

నల్లబాలు.నల్లత్రాచు లెక్క.

నాకి చంపేస్తా’ అంటూ వేణుమాధవ్‌ రాజమౌళిని అక్కడి నుంచి తరిమేస్తాడు.ఈ డైలాగ్‌ వేణుమాధవ్ చాలా హిలేరియస్ గా చెప్పడంతో రాజమౌళి కట్‌ చెప్పడం మర్చిపోయాడట.

నవ్వుతూనే ఉన్నాడట.

Telugu Venu Madhav, Nithin, Rajamouli, Sye, Venu Madhav Sye-Movie

ఈ సీన్ బాగా వచ్చిందని మూవీ మేకర్స్ సంతోషించారు.తర్వాత సినిమా షూటింగ్‌ పూర్తయిపోయి ఎడిటింగ్‌ పార్ట్ చూస్తున్నప్పుడు కూడా వేణుమాధవ్‌ సీన్‌( Venu Madhav Scene ) చూసి చాలా నవ్వేశారట.అలాంటి సీన్స్‌ మరో రెండు ఉంటే మూవీ పక్క బ్లాక్ బస్టర్ అవుతుందని చాలామంది సలహా కూడా ఇచ్చారట.

దాంతో వేణుమాధవ్ ను ఇలాంటి మరో రెండు సీన్లు రాయాలని రాజమౌళి కోరాడు.ఈ కమెడియన్ బాగా ఆలోచించి ఏసీపీ అరవింద్‌ (సమీర్‌), భిక్షుయాదవ్‌ (ప్రదీప్‌ రావత్‌)లతో కూడా ఇదే సన్నివేశం చేస్తే చాలా బాగుంటుందని అన్నారట రాజమౌళి కూడా అందుకు అంగీకరించి ఆ రెండు సీన్లను యాడ్ చేశారు.

ఇవి మొత్తం మూవీకే హైలైట్ అయ్యాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube