భారత్ కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ లో అద్భుత ఇన్నింగ్స్ తో ఓపెనర్లు చెలరేగడంతో తొమ్మిది వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది.భారత జట్టు ఓపెనర్ లైన యశస్వి జైస్వాల్ ( Yashasvi Jaiswal )(84) నాట్ అవుట్, శుబ్ మన్ గిల్( Ꮪhubman Gill ) (77) లతో రాణించడం వల్ల భారత్ చాలా సులభంగా విజయం సాధించింది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండీస్ జట్టు షిమ్రాన్ హెట్మేయేర్ రాణించడంతో 177 పరుగులను నమోదు చేసింది.అనంతరం లక్ష్య చేదనకు దిగిన భారత జట్టు ఆరంభం నుంచే ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా మెరుపు ఆట ప్రదర్శనను చేశారు.
జైస్వాల్ భారీ షాట్లతో ఆరంభం నుండే దూకుడుగా ఆడాడు.గిల్ కొంత సమయం తీసుకుని క్రీజ్లో కుదురుకున్నాడు.ఇక ఇద్దరు ఓపెనర్లు ఎడాపెడా బౌండరీలతో ఆకట్టుకున్నారు.

ఇటీవలే కాలంలో భారత్ కు దక్కిన అతి భారీ ఓపెనింగ్ రికార్డ్ ఇదే.జైస్వాల్, గిల్ చెలరేగి ఆడుతూ ఉండడంతో వీరిద్దరే మ్యాచ్ ముగించేస్తారని అంతా అనుకున్నారు.కానీ మ్యాచ్ చివరి దశలో గిల్ అవుట్ అయ్యాడు.
తొలి వికెట్ కు 165 పరుగులను జోడించారు.

కీలక మ్యాచ్లో అద్భుత ఇన్నింగ్స్ ఆడి భారత్ ను గెలిపించినందుకు ప్రస్తుతం జైస్వాల్, గిల్ లపై భారత క్రికెట్ అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.రోహిత్,( Rohit Sharma ) ధావన్ తరువాత మళ్లీ లెఫ్ట్, రైట్ కాంబినేషన్లో అదిరే జోడి దక్కిందంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.భారత్ కు ఫ్యూచర్ ఓపెనింగ్ జోడి ఇదే అని ఫ్యాన్స్ వీరిద్దరిని ఆకాశానికి ఎత్తేస్తున్నారు.
ఈ ఓపెనింగ్ జోడి ఆటను చూస్తే ఎవరైనా ఒకరు కచ్చితంగా సెంచరీ చేస్తారని భావించారు.కానీ ఎవరికి కూడా సెంచరీ చేసే అవకాశం దక్కలేదు.ఇక చివరి మ్యాచ్ లో కూడా ఇలాంటి ఆటనే ప్రదర్శించి టైటిల్ కైవసం చేసుకోవాలని భారత క్రికెట్ అభిమానులతో పాటు క్రికెట్ నిపుణులు కోరుకుంటున్నారు.







