సందీప్ వంగా రెడ్డికి భలే విలన్ దొరికాడే.. ఈ ప్లాన్ సక్సెస్ అయితే రికార్డ్స్ బద్దలే..

సౌత్ కొరియన్-అమెరికన్ యాక్టర్ మా డాంగ్-సియోక్( Ma Dong-Seok ) గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పనిలేదు.ఈ నటుడు సోషల్ మీడియాలో బాగా కనిపిస్తుంటాడు.

 Sandeep Reddy Vanga Plan For Prabhas Spirit Movie Villain Ma Dong-seok Details,-TeluguStop.com

ఈ హీరోకి ఇండియాలో కూడా మంచి మార్కెట్ ఉంది.అందుకే పుష్ప పార్ట్-2లో( Pushpa 2 ) అతడిని ఓ విలన్‌గా నటింపజేయాలనుకున్నారు.

కానీ కొన్ని కారణాలవల్ల తీసుకోలేదు.ఒకవేళ డాంగ్-సియోక్‌ని తీసుకుంటే ఫహాద్ ఫాజిల్ తేలిపోతాడు.

అందుకే అతను ఆ కొరియన్‌ ఎందుకు అన్నట్లు బాగా ఇరిటేట్ అవుతున్నట్లు తెలుస్తోంది.

Telugu Allu Arjun, Kalki, Ma Dong Seok, Madong, Prabhas, Prabhasma, Pushpa, Sand

బన్నీ కూడా పుష్ప-2 సినిమా గురించి అసంతృప్తి గానే ఉన్నాడట.30 నుంచి 40% వరకు సినిమాని రీ షూట్ చేయాల్సిందిగా బన్నీ కోరుతున్నాడట.ఇక యాక్టర్లు సరిగా చేయలేదంటూ సుకుమార్ మండిపడుతున్నట్లు తెలుస్తోంది.

ఒకవైపు రామ్‌ చరణ్, మరోవైపు ఎన్టీఆర్ ఇంకోవైపు ప్రభాస్( Prabhas ) ఇలాంటి పాన్ ఇండియా స్టార్ల సినిమాల మధ్య సర్వైవ్ కావాలంటే బన్నీ( Bunny ) మంచి సినిమాతోనే రావాలి.అందుకే ఈ స్టైలిష్ స్టార్ ఇప్పుడు ఈ సినిమా బాగా రావాలని పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది.

ఒకవేళ సౌత్ కొరియన్ విలన్ పుష్ప-2 ప్రాజెక్టులో ప్రతి నాయకుడిగా కనిపించి ఉంటే సినిమాకి మంచి హైప్‌ వచ్చేది.కానీ బడ్జెట్ ఎక్కువ అవుతుందని అతన్ని తీసుకోలేదు.

Telugu Allu Arjun, Kalki, Ma Dong Seok, Madong, Prabhas, Prabhasma, Pushpa, Sand

అయితే అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాలతో సెన్సేషనల్ డైరెక్టర్ గా మారిన వంగా సందీప్‌ రెడ్డి( Sandeep Reddy Vanga ) మాత్రం తన సినిమాలో ఎలాగైనా సౌత్ కొరియన్ యాక్టర్ మా డాంగ్-సియోక్‌ని నటింపజేయాలని బాగా ప్రయత్నిస్తున్నాడట.ఈ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా “స్పిరిట్” సినిమా( Spirit Movie ) చేస్తున్న సంగతి తెలిసిందే.ఆ సినిమా కోసమే ఈ ఫారిన్ విలన్‌ను లైన్‌లో పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి.“స్పిరిట్” సినిమాను కల్కికి( Kalki ) మించిన హిట్ చేయాలని సందీప్ బాగా కోరుకుంటున్నాడు.ఈ సినిమాని చైనా, కొరియా భాషల్లో కూడా డబ్ చేసి విడుదల చేయాలని పెద్ద ప్లాన్ చేస్తున్నాడు.

Telugu Allu Arjun, Kalki, Ma Dong Seok, Madong, Prabhas, Prabhasma, Pushpa, Sand

అంటే, పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ మూవీ అన్నమాట.ఒకవేళ ఈ సినిమా మంచిగా వస్తే సందీప్ పేరు వరల్డ్ వైడ్ గా మారుమోగుతుంది.ప్రభాస్ రేంజ్ మరెక్కడికి వెళ్ళిపోతుంది.

మరి వంగా సందీప్‌రెడ్డి మాస్టర్ ప్లాన్ వర్కౌట్ అవుతుందా? రాజమౌళి, నాగ్ అశ్విన్‌ను బీట్ చేయాలని తపన పడుతున్న అతడి కోరిక నెరవేరుతుందా? దీనికి కాలమే సమాధానం చెప్పాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube