తాజాగా జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అనుకున్నంతగా రాణించలేకపోయింది.దుబ్బాకలో జోరుగా ప్రచారం చేసినా, అదే విధంగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడిపోవడంతో ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ వైభవం కొంత దెబ్బతిందని చెప్పవచ్చు.
ఇప్పటివరకు టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ఉన్న కాంగ్రెస్ కాస్తా మూడో స్థానానికి పడిపోయింది.ఇప్పుడు కాంగ్రెస్ కు తిరిగి పూర్వ వైభవం కల్పించాలనే ఉద్దేశ్యంతో రేవంత్ రెడ్డి రాజీవ్ రైతు భరోసా పేరిట పాదయాత్రను చేపట్టారు.
కాని మనం ముఖ్యంగా గమనించవలసినది ఏమనగా కాంగ్రెస్ పార్టీలో గ్రూపు రాజకీయాలు ఎక్కువ, కాంగ్రెస్ లో ఎవరైనా ఎదగాలంటే చాలా సమీకరణాలు ఉంటాయి.ఇలాంటి వాతావరణంలో రేవంత్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర కాంగ్రెస్ పార్టీకి లాభం చేకూరేది అయినా సీనియర్లు సహకరించకపోతే ప్రజల్లోకి కాంగ్రెస్ పార్టీ పట్ల ఐకమత్యం ఉంది అనేది ప్రజలకు కనిపించదు.
ఇప్పటివరకు పాదయాత్రలు చేపట్టిన వారు సీఎంలుగా అయిన చరిత్ర ఉంది.ఏది ఏమైనా ఇది కాంగ్రెస్ నుండి ఒక మంచి ముందడుగు అని చెప్పవచ్చు.అందరూ సీనియర్ లు కలిసి రాకపోతే రేవంత్ రెడ్డి పాదయాత్రకు అనుకున్నంతగా ఆదరణ రాకపోవచ్చు.చూద్దాం మరి రేవంత్ రెడ్డి పాదయాత్ర రాష్ట్ర రాజకీయాలలో ఎంతమేర ప్రభావం చూపిస్తుందనేది.