రేవంత్ రెడ్డి జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు..: ఎమ్మెల్యే కడియం శ్రీహరి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి( Telangana CM Revanth Reddy )పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.సీఎం రేవంత్ రెడ్డి ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

 Revanth Reddy Is Speaking Without Knowledge..: Mla Kadiam Srihari , Telangana Cm-TeluguStop.com

వంద మీటర్ల లోతులో బీఆర్ఎస్ ను బొంద పెడుతా అంటే బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు రెచ్చిపోరా అని కడియం శ్రీహరి ప్రశ్నించారు.రేవంత్ రెడ్డి కావాలనే బీఆర్ఎస్ పార్టీని రెచ్చగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఛార్లెస్ – ఓబుల, బిల్లా – రంగా అని తమ వారిని విమర్శిస్తున్నారన్న కడియం శ్రీహరి మీ చరిత్ర, మీపై ఎన్ని కేసులు ఉన్నాయో ప్రజలకు తెలియదా అని ప్రశ్నించారు.ఎన్నికల్లో 420 హామీలు ఇచ్చారన్న ఆయన కేవలం రెండు హామీలు అమలు చేశారని తెలిపారు.

ఈ క్రమంలోనే రానున్న లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్( BRS party ) సత్తా ఏంటో చూపిస్తామని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube