మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) ఖాతాలో మరో అరుదైన ఘనత చేరింది.ఆయనకు పద్మ విభూషణ్( Padma Vibhushan ) రావడంతో ఫ్యాన్స్ ఎంతగానో సంతోషిస్తున్నారు.మెగాస్టార్ చిరంజీవి ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహించి కష్టాల్లో ఉన్నవాళ్లకు తన వంతు సహాయం చేశారు.68 సంవత్సరాల వయస్సులో కూడా యంగ్ జనరేషన్ స్టార్స్ కు ఛాన్స్ ఇస్తూ చిరంజీవి నటుడిగా ఒక్కో మెట్టు పైకి ఎదుగుతుండటం గమనార్హం.
చిరంజీవికి ఉత్తమ నటుడిగా ఏడు సుత్ ఫిల్మ్ ఫేర్ అవార్డులు రావడంతో పాటు మూడు నందులు అందుకున్నారు.రఘుపతి వెంకయ్య పురస్కారాలతో పాటు ఫిల్మ్ ఫేర్ లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డులను సొంతం చేసుకోవడం గమనార్హం.2006 సంవత్సరంలో పద్మ భూషణ్ ను అందుకున్న చిరంజీవి 18 సంవత్సరాల తర్వాత పద్మ విభూషణ్ ను అందుకున్నారు.రామ్ చరణ్ కు( Ram Charan ) సైతం రెండు నంది అవార్డులతో పాటు పాప్ గోల్డెన్ అవార్డ్, సైమా అవార్డ్ వచ్చాయి.
పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) సైతం ఫిల్మ్ ఫేర్ అవార్డ్ లతో పాటు నంది అవార్డ్ లను సొంతం చేసుకున్నారు.పవన్ కళ్యాణ్ టాలెంట్ కు సైమా అవార్డ్ తో పాటు ఇతర అవార్డులు సైతం వచ్చాయి.చరణ్ భార్య ఉపాసనకు( Upasana ) తను అందిస్తున్న సేవలకు మహాత్మగాంధీ అవార్డ్ వచ్చింది.అల్లు అర్జున్( Allu Arjun ) సైతం జాతీయ అవార్డ్ తో పాటు ఐదు నంది అవార్డ్ లను అందుకున్నారు.
మెగా ఫ్యామిలీ ఎన్నో అవార్డులను సొంతం చేసుకోవడం ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తోంది.
మెగాస్టార్ చిరంజీవి భవిష్యత్తులో మరిన్ని అవార్డులను సొంతం చేసుకోవడంతో పాటు ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తున్నారు.చిరంజీవి ప్రస్తుతం 50 నుంచి 65 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ ను అందుకుంటున్నారు.చిరంజీవి ఇతర భాషల్లో సైతం మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు.