అభ్యర్థుల ఎన్నికల ప్రచార ఖర్చుల నమోదు పకడ్బందీగా చేపట్టాలి

రాజన్న సిరిసిల్ల జిల్లా: అభ్యర్థుల ఎన్నికల ఖర్చుల వివరాలను కచ్చితంగా నమోదు నమోదు చేయాలని, పర్యవేక్షణలో ఎలాంటి లోపం లేకుండా చూడాలని కేంద్ర ఎన్నికల వ్యయ పరిశీలకుడు రాజన్న సిరిసిల్ల ఎన్నికల వ్యయ పరిశీలకులు మణిగండసామి (మనిగండ సామి) అన్నారు.శుక్రవారం సిరిసిల్ల, వేములవాడ రిటర్నింగ్ అధికారి కార్యాలయాలను రాజన్న సిరిసిల్ల ఎన్నికల వ్యయ పరిశీలకులు మణిగండసామి తనిఖీ చేశారు.

 Registration Of Election Campaign Expenses Of The Candidates Should Be Done In F-TeluguStop.com

షాడో అబ్జర్వేషన్ రిజిస్టర్ లను, ఫోల్డర్ ఆఫ్ ఎవిడెన్స్ లను పరిశీలించారు.సహాయ వ్యయ పరిశీలకులు, అకౌంటింగ్ టీమ్ లు, వి ఎస్ టి ,వి వి టీ టీమ్ లకు పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా ఎన్నికల వ్యయ పరిశీలకులు మణిగండసామి మాట్లాడుతూ.నామినేషన్ దాఖలు నుంచి ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు వ్యయ పరిశీలన బృందాలు ఖర్చుల వివరాలు నమోదు చేయాలన్నారు.

ఎన్నికల నియమావళి అమలుకు ఏర్పాటు చేసిన నిఘా బృందాలు జిల్లాలో సమర్థవంతంగా తమ బాధ్యతలను నిర్వర్తించేలా చూడాలని నోడల్ అధికారులకు చెప్పారు.ఆమోదయోగ్యం కాని ఖర్చుల వివరాలనుసహాయ వ్యయ పరిశీలకులు అకౌంట్ బృందం, వీఎస్టీ, వీవీటీలు పర్యవేక్షించాలన్నారు.

ర్యాలీలు, బహిరంగ సభలు, సమావేశాలు, రోడ్లన్నింటిని వీడియో సర్వేలెన్స్ టీం సభ్యులు రికార్డింగ్ చేసి వీడియో పరిశీలన సభ్యుల ద్వారా వివరాలను అకౌంటింగ్ టీం సభ్యులను సమన్వయం చేసుకోవాలన్నారు.నిర్ణయించిన రేటు ప్రకారం ఖర్చులు నమోదు చేయాలన్నారు.

ఓటర్లను ప్రలోభపెట్టేందుకు కానుకలు పంపిణీ చేయకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.ఈ సందర్శనలో పరిశీలకుల వెంట జిల్లా వ్యయ పర్యవేక్షణ కమిటీ నోడల్‌ అధికారి రామ కృష్ణ, ప్రత్యేక అధికారిని స్వప్న తదితరులు ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube