తెలంగాణకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది.ఈ మేరకు రాష్ట్రంలోని ఐదు జిల్లాలకు రెడ్ అలర్ట్ ఇచ్చింది.
ఈ క్రమంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.ఖమ్మం, మహబూబాబాద్, నల్గొండ, సూర్యాపేటతో పాటు యాదాద్రి జిల్లాలో రెడ్ అలర్ట్ ఇచ్చిన అధికారులు అత్యంత భారీ వర్షాలు పడతాయని హెచ్చరించారు.
అదేవిధంగా మరో 20 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.ఈ నేపథ్యంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని తెలిపారు.
మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది.ఈ క్రమంలో ఇవాళ, రేపు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది.