ట్విట్టర్ లోగోలో( Twitter Logo ) మార్పులు చేసిన విషయం తెలిసిందే.నిన్నటివరకు బ్లూ కలర్ ఆకారంలో పిట్ట ఉండేది.
కానీ ఇప్పుడు ట్విట్టర్ లోగోలో పిట్ట ఎగిరిపోయింది.దాని స్థానంలో X అనే సింబల్ వచ్చింది.
దీంతో ఇక నుంచి ఇదే ట్విట్టర్ లోగోగా ఉండనుంది.అయితే ఇలాంటి లోగోనే ఇప్పటికే పలు కంపెనీలకు ఉంది.
దీంతో భవిష్యత్తులో ట్విట్టర్ న్యాయపరమైన ఇబ్బందులును ఎదుర్కొనే అవకాశముందని చెబుతున్నారు.
మార్క్ జూకర్ బర్గ్ కి చెందిన మెటా, ( Meta ) అలాగే బిల్‌గేట్స్‌కి సంబంధించిన మైక్రోసాఫ్ట్ తో( MicroSoft ) పాటు అనేక కంపెనీలు X అనే ఆక్షరంపై మేధో సంపత్తి హక్కులు కలిగి ఉన్నాయి.అలాగే X అనేది ప్రపంచవ్యాప్తంగా వినియోగంలో ఉన్న ట్రేడ్ మార్క్‌లలో ఒకటిగా ఉంది.ఇప్పటికే పలు సంస్థలు తమ బ్రాండింగ్ కోసం దాని ఆకారంలో ఉన్న లోగోను రిజిస్టర్ చేసుకుున్నాయి.
దీంతో ఆ సంస్థలు లీగల్ గా క్లెయిమ్ చేసుకునే అవకాశముందని ట్రేడ్‌మార్క్ నిపుణులు చెబుతున్నారు.
అమెరికాలోనే X అక్షరంపై దాదాపు 900 యాక్టిక్ ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్లు ఉన్నాయి.దీంతో ఆ కంపెనీల యజమానులు ఈ లోగోపై హక్కులను దక్కించుకునేందుకు త్వరలో కోర్టులను ఆశ్రయించే అవకాశముందని తెలుస్తోంది.మైక్రోసాఫ్ట్ కంపెనీ ఎక్స్ బ్యాక్స్( X Box ) అనే వీడియో గేమ సిస్టమ్‌కు X అనే ట్రేడ్ మార్క్‌ను వాడుతోంది.
అలాగే బ్లూ అండ్ వైట్ కలర్ లో X అనే ఆక్షరానికి 2019లో ఫేస్ బుక్ ట్రేడ్ మార్క్ కు రిజిస్టర్ చేసుకుంది.ఫేస్ బుక్ పేరును మెటాగా మార్చే సమయంలో కూడా మార్క్ జూకర్ బర్గ్ అనేక ట్రేడ్ మార్క్ కేసులను ఎదుర్కొన్నాయి.
మెటా క్యాపిటల్, మెటా ఎక్స్ కంపెనీలు కోర్టును ఆశ్రయించారు.ఇప్పుడు ట్విట్టర్ కు కూడా అలంటి ఇబ్బందులు రావొచ్చు.