ఏపీలో వైసీపీ రీజనల్ కో-ఆర్డినేటర్ల నియామకం

ఏపీలో అధికార పార్టీ వైఎస్ఆర్సీపీలో రీజ‌న‌ల్ కో ఆర్డినేట‌ర్ల పేరిట నేత‌ల‌కు కొత్త బాధ్య‌త‌లు ప్ర‌క‌టించారు.రీజ‌న‌ల్ కో ఆర్డినేట‌ర్లుగా నియ‌మించిన పార్టీ అధిష్ఠానం ఈ మేర‌కు ఉత్త‌ర్వులు జారీ చేసింది.

 Recruitment Of Ycp Regional Coordinators In Ap-TeluguStop.com

శ్రీకాకుళం, పార్వతీపురం, అల్లూరి జిల్లాల కోఆర్డినేటర్ గా మంత్రి బొత్స నియామకం అయ్యారు.విజయనగరం, విశాఖ, అనకాపల్లి జిల్లాల కోఆర్డినేటర్ గా వైవీ సుబ్బారెడ్డి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాల కోఆర్డినేటర్లుగా పిల్లి సుభాష్, పీవీ మిథున్ రెడ్డిలను పార్టీ అధిష్టానం నియమించింది.

అదేవిధంగా పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల కోఆర్డినేటర్లుగా మస్తాన్ రావు, కరుణాకర్ రెడ్డిలు,.కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల కోఆర్డినేటర్లుగా రాజశేఖర్, అయోధ్య రామిరెడ్డి,.

నెల్లూరు, తిరుపతి, కడప జిల్లాల కోఆర్డినేటర్ గా బాలినేని శ్రీనివాస్ రెడ్డిలు నియమితులు అయ్యారు.అటు చిత్తూరు, అనంతపురం, సత్యసాయి, అన్నమయ్య జిల్లాల కోఆర్డినేటర్ గా పెద్దిరెడ్డి,.

కర్నూలు, నంద్యాల జిల్లాల వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ గా అమర్నాథ్ రెడ్డిలను పార్టీ హైకమాండ్ నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube