తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో గుర్తింపు సంఘం ఎన్నికల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది.ఈ మేరకు ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలంటూ ఎంప్లాయీస్ యూనియన్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఈ నేపథ్యంలో పిటిషన్ ను విచారించిన ధర్మాసనం ఎలక్షన్ జరపాలని ఆదేశాలు జారీ చేసింది.
అయితే టీఎస్ ఆర్టీసీలో గత మూడేళ్లుగా యాజమాన్యం గుర్తింపు సంఘం ఎన్నికలను నిర్వహించని సంగతి తెలిసిందే.