జబర్దస్త్ షో ద్వారా ఊహించని స్థాయిలో పాపులర్ అయిన కమెడియన్లలో సుడిగాలి సుధీర్ ఒకరు.రోజురోజుకు సుధీర్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు.
జబర్దస్త్ షో ద్వారా ఊహించని స్థాయిలో గుర్తింపును సొంతం చేసుకుని ఒక వెలుగు వెలిగిన సుధీర్ ఇతర ఛానెళ్లు ఎక్కువ మొత్తంలో రెమ్యునరేషన్ ఆఫర్ చేయడంతో ఇతర ఛానెళ్ల ప్రోగ్రామ్ లకు ఓకే చెప్పడం జరిగింది.
అయితే గత కొన్నిరోజులుగా సుధీర్ ఏ ప్రోగ్రామ్ లో కూడా కనిపించడం లేదు.
ఈటీవీ ఇచ్చిన స్థాయిలో సుధీర్ కు ఇతర ఛానెళ్లు ప్రాధాన్యత ఇవ్వడం లేదని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. జబర్దస్త్ షోకు గుడ్ బై చెప్పడమే సుధీర్ కు శాపమైందని కామెంట్లు వినిపిస్తున్నాయి.
మరోవైపు ఈ మధ్య కాలంలో సుధీర్ నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదు.
సుధీర్ మళ్లీ జబర్దస్త్ షోలోకి రీఎంట్రీ ఇవ్వాలని అనుకున్నా అక్కడ రీఎంట్రీ ఇచ్చే పరిస్థితులు అయితే లేవనే సంగతి తెలిసిందే.
ఇతర ఛానెళ్లలోని షోల కోసం జబర్దస్త్ షోకు గుడ్ బై చెబితే మల్లెమాల నిర్వాహకులు వాళ్లకు ఛాన్స్ ఇవ్వడానికి అస్సలు ఆసక్తి చూపరు.సుధీర్ కు కూడా ఇదే పరిస్థితి ఎదురు కానుంది.
జబర్దస్త్ స్థాయిలో సక్సెస్ సాధించిన కామెడీ షోల సంఖ్య తక్కువనే సంగతి తెలిసిందే.

సుడిగాలి సుధీర్ ఎక్స్ట్రా జబర్దస్త్ కు దూరమైనా షో రేటింగ్ లపై ఆ ప్రభావం పెద్దగా పడలేదు.యాంకర్ అనసూయ సైతం ప్రస్తుతం ఇదే తరహా పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.అయితే అనసూయ చేతిలో సినిమా ఆఫర్లు ఎక్కువ సంఖ్యలో ఉన్న నేపథ్యంలో ఆమె కెరీర్ కు ఇబ్బంది లేదు.
సుధీర్ మాత్రం కెరీర్ విషయంలో తప్పటడుగులు వేశాడనే చెప్పాలి.