ఈ మధ్య కాలంలో రీ రిలీజ్ లు( Re release ) ఎక్కువ అవుతున్నాయి.మొన్నటి వరకు స్టార్ హీరోల సినిమా లు మాత్రమే రీ రిలీజ్ అయిన విషయం మనం చూస్తూనే ఉన్నాం.
ఇప్పుడు చిన్న హీరోల సినిమా లు వివాదాస్పద సినిమా లు కూడా తెర పై మళ్లీ వస్తున్నాయి.పెద్ద ఎత్తున రీ రిలీజ్ లు అవుతున్న ఈ సమయంలో ప్రేక్షకులు బాబోయ్ ఆపండ్రోయ్ అంటూ విమర్శలు చేస్తున్నారు.
ఏంటి ఈ రచ్చ అంటూ కొందరు విమర్శలు చేస్తున్నారు.మొత్తానికి ఈ మధ్య విడుదల అవ్వుతున్న పాత సినిమాలు కొన్ని వెగటు పుట్టించేవిగా ఉన్నాయి అంటున్నారు.
ఇటీవలే 7/జీ బృందావన కాలనీ( 7G Brudavan Colony ) సినిమా విడుదల అయింది.యూత్ ఆడియన్స్ ఆ సినిమా కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
కనుక సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుంది.అయితే రతి నిర్వేదం సినిమా ను కూడా రీ రిలీజ్ చేయడం ఏంటో అర్థం కావడం లేదు.యూత్ ఆడియన్స్ ను అప్పట్లో అలరించిన సినిమా రతి నిర్వేదం( Rathinirvedam )ఆ సినిమాకు సంబంధించిన వసూళ్లు అప్పట్లో భారీగా నమోదు అయ్యాయి.ఇప్పుడు మళ్లీ రతి నిర్వేదం వస్తుందని అంతా భావిస్తున్నారు.
అన్నట్లుగానే రతి నిర్వేదం ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు.
వరుసగా వస్తున్న సినిమాల తరహా లోనే రతి నిర్వేదం సినిమా ను మళ్లీ విడుదల చేస్తే ఎలాంటి ఫలితం ఉంటుంది అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రొమాంటిక్ సినిమా కనుక కచ్చితంగా యూత్ ఆడియన్స్ థియేటర్ల ముందు క్యూ కడుతారు.కనుక వసూళ్లు అయితే బాగానే వస్తాయి.
కానీ విలువలు ఎక్కడ ఉన్నాయి అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.ఇలాంటి నీచమైన పద్దతికి స్వస్థి చెప్పకుంటే ముందు ముందు ఎలాంటి సినిమాలు వస్తాయో.
ఎలాంటి సినిమాలను మన యూత్ చూడబోతుందో అనే ఆందోళన కొందరు వ్యక్తం చేస్తున్నారు.