రవితేజ 'ఈగల్‌' పాన్‌ ఇండియా రిలీజ్ లో ట్విస్ట్‌..!

ఈ మధ్య కాలం లో అందరు హీరో ల సినిమా లు కూడా పాన్ ఇండియా రేంజ్ లో విడుదల అవ్వడం మనం చూస్తూ ఉన్నాం.ఫలితాల విషయం పక్కన పెడితే అన్ని భాషల్లో డబ్‌ చేసి విడుదల చేయడం పరిపాటిగా మారింది.

 Ravi Teja Eagle Movie Hindhi Version Saindhav , Ravi Teja, Eagle , Anupama Par-TeluguStop.com

అందులో భాగంగానే రవితేజ హీరోగా కార్తీక్‌ ఘట్టమనేని( Karthik Gattamneni) దర్శకత్వం లో రూపొందిన ఈగల్ సినిమా ( Eagle )ను కూడా భారీ ఎత్తున పాన్ ఇండియా రేంజ్ లో సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది.సంక్రాంతి బరి నుంచి తప్పుకున్నాడు అంటూ ఆ మధ్య ప్రచారం జరిగితే కొట్టి పారేసిన మేకర్స్ ఈగల్ సినిమా ను సంక్రాంతికి విడుదల చేయాలనే పట్టుదలతో ఉన్నారు.

ఇక సినిమా ను హిందీ లో ఈగల్ అనే టైటిల్‌ తో కాకుండా సైంధవ్ అనే టైటిల్ తో విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా ప్రకటించారు.అంతే కాకుండా సైంధవ్‌ అనే టైటిల్‌ ను కూడా అధికారికంగా పీపుల్స్ మీడియా వారు ప్రకటించారు.ఆ కొత్త టైటిల్‌ తో సినిమా యొక్క టీజర్ ను విడుదల చేయడం జరిగింది.టీజర్ కి మంచి స్పందన రావడంతో అన్ని వర్గాల ప్రేక్షకులను అక్కడ కూడా ఈ సినిమా ఆకట్టుకుంటుందనే నమ్మకంను కొందరు వ్యక్తం చేస్తున్నారు.

బాక్సాఫీస్ వద్ద రవితేజ( Ravi Teja ) గత చిత్రాలు నిరాశ పరిచాయి.ముఖ్యంగా రావణాసుర మరియు టైగర్‌ నాగేశ్వరరావు సినిమా లు ఈ ఏడాది లో విడుదల అయ్యి నిరాశ పరిచిన విషయం తెల్సిందే.అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా ఈగల్ ఉంటే తప్పకుండా అక్కడ ఇక్కడ మంచి వసూళ్లు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.సంక్రాంతికి ఉన్న భారీ పోటీ నేపథ్యం లో ఈగల్ ఎంత వరకు ప్రభావం చూపిస్తుంది అనేది తెలియాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube