నేషనల్ క్రష్ రష్మిక మందన్న( Rashmika Mandanna ) యానిమల్ తో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.రణబీర్ కపూర్ కి జోడీగా సందీప్ వంగ దర్శకత్వంలో ఆ సినిమా ను రష్మిక మందన్న చేసిన విషయం తెల్సిందే.
రష్మిక మందన్న కి బాలీవుడ్ లో మొదటి కమర్షియల్ బ్రేక్ గా నిలిచిన యానిమల్ సినిమా( Animal Movie ) వెయ్యి కోట్ల వసూళ్లు దిశగా దూసుకు పోతుంది.రికార్డ్ స్థాయి వసూళ్ల ను సొంతం చేసుకున్న సినిమా ల జాబితాలో ఇప్పటికే చేరి పోయిన యానిమల్ కారణంగా రష్మిక మందన్న స్టార్ డం అమాంతం పెరిగింది.
ఈ సమయంలో సౌత్ లో ఈమె నటిస్తున్న సినిమా లకి విపరీతమైన క్రేజ్ ఉంది.

పుష్ప 2 లో( Pushpa 2 ) రష్మిక మందన్న నటిస్తున్న విషయం తెల్సిందే.తాజాగా ది గర్ల్ ఫ్రెండ్( The Girlfriend ) అనే లేడీ ఓరియంటెడ్ సినిమా ను కూడా మొదలు పెట్టింది.అయితే గతం లో నితిన్ తో( Nithiin ) వెంకీ కుడుముల( Venky Kudumula ) దర్శకత్వం లో మొదలు పెట్టిన సినిమా ఏమైంది అంటూ చర్చ జరుగుతోంది.
ఆ సినిమా ను మైత్రి మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మించేందుకు ముందుకు వచ్చారు.నితిన్, వెంకీ కుడుముల, రష్మిక కాంబో లో గతంలో భీష్మ సినిమా( Bheeshma Movie ) వచ్చింది.
ఆ సినిమా కి మంచి టాక్ లభించడం వల్ల ఇప్పుడు మరోసారి వారి కాంబో రిపీట్ చేయాలని భావించారు.

లాంచనంగా సినిమా ను ప్రకటించారు.జీవి ప్రకాష్ ను సంగీత దర్శకుడు అంటూ కూడా ప్రకటించారు.ఇంతలో ఏమైందో కానీ సినిమా ను గురించి ఎలాంటి అప్‌డేట్ ఇవ్వలేదు.
అసలు సినిమా ఉందా లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.ముందు ముందు అయినా ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయా అంటే మైత్రి మూవీ మేకర్స్ ఆఫీస్ కు చెందిన వారి నుంచి స్పష్టమైన క్లారిటీ లేదు అంటూ మీడియా వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
అసలు విషయం ఏంటి అనేది తెలియాలంటే మరి కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.