అర్జున్ రెడ్డి సినిమా( Arjun Reddy movie ) తో దర్శకుడి గా పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు దక్కించుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ( Sandeep Reddy Vanga )ప్రస్తుతం యానిమల్ సినిమా ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారు.బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ హీరో గా రష్మిక మందన్న హీరోయిన్ గా రూపొందిన యానిమల్ సినిమా( Animal movie ) కు తాజాగా సెన్సార్ కట్స్ పూర్తి అయ్యాయి.
ఏ సర్టిఫికెట్ ను ఇవ్వడం జరిగిందట.
ఆ విషయం పక్కన పెడితే ఈ సినిమా కు దర్శకుడు తెలుగు దర్శకుడు అవ్వడం తో తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.రణబీర్ కపూర్ గతంలో నటించిన ఏ సినిమాకు కూడా దక్కనంత బిజినెస్ తెలుగు రాష్ట్రాల్లో ఈసారి జరిగింది.అందుకు కారణం సందీప్ వంగ అనడం లో సందేహం లేదు.
యానిమల్ సినిమా ను ఒక తెలుగు సినిమా అన్నట్లుగా కొనుగోలు చేసిన బయ్యర్లు( Buyers ) ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు.ఈ మధ్య కాలంలో వరుసగా ప్రమోషనల్ ఈవెంట్స్ చేస్తే కానీ సినిమా ను జనాలు పట్టించుకునే పరిస్థితి లేదు.
అలాంటిది యానిమల్ మేకర్స్ పబ్లిసిటీ మొత్తం కూడా ఉత్తర భారతం లో చేస్తే ఎలా అంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా ఈ సినిమా ఉంటుందా అంటే ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాకు దూరంగా ఉంటారేమో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.పైగా సినిమా ను మూడున్నర గంటల నిడివి అంటున్నారు.మొత్తానికి చాలా రకాల అనుమానాలు ఉన్నాయి, ఇదే సమయంలో సినిమా యొక్క పబ్లిసిటీ ఇక్కడ తక్కువగా చేస్తున్నారు.
కనుక ఎంత వరకు సినిమా ఇక్కడ వర్కౌట్ అయ్యేను అంటూ బయ్యర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.