అయోధ్యలో రామ మందిర( Ayodhya Ram Mandir ) ప్రారంభోత్సవం నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలలో స్థిరపడిన ప్రవాస భారతీయులు సంబరాలు జరుపుకుంటున్నారు.ప్రధానంగా భారతీయులకు రెండో ఇల్లు లాంటి అమెరికాలో( America ) అయోధ్య రామాలయ ప్రారంభోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.
మన సంస్కృతీ, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు ఉట్టిపడేలా భజనలు, కీర్తనలతో ఈ కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించుకుంటున్నారు.ఇందులో పలువురు విదేశీయులు సైతం పాల్గొనడం విశేషం.
అమెరికా వాణిజ్య రాజధాని న్యూయార్క్‌లోని ప్రఖ్యాత టైమ్స్ స్క్వేర్‌లో( New York Times Square ) భారతీయులు పెద్ద సంఖ్యలో గుమిగూడారు.ఈ జంక్షన్‌లోని బిల్‌బోర్డుపై రాముడి చిత్రాలను ప్రదర్శించారు.
అయోధ్యలో జరుగుతున్న ప్రాణ్ ప్రతిష్ట( Pran Pratistha ) కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు భారీ స్క్రీన్‌ను ఏర్పాటు చేశారు.ఒక్క న్యూయార్క్ మాత్రమే కాదు.అమెరికాలోని ప్రధాన నగరాల్లో ఎక్కడ చూసినా పండుగ వాతావరణం నెలకొంది.
ప్రవాస భారతీయులు సంప్రదాయ దుస్తులు ధరించి శ్రీరాముడి చిత్రాలున్న జెండాలు చేతపట్టి సందడి చేస్తున్నారు.రామ నామ స్మరణతో వీధులన్నీ కోలాహలంగా మారాయి.మసాచుసెట్స్‌లోని వొర్సెస్టర్ నగర మేయర్ జో పెట్టీ హిందువులకు శుభాకాంక్షలు తెలపడంతో పాటు అక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
విశ్వహిందూ పరిషత్ అమెరికా విభాగంతో పాటు హిందూ ధార్మిక సంస్థలు, ప్రవాస భారతీయ సంఘాలు ఈ కార్యక్రమాల బాధ్యతను తీసుకున్నాయి.
ఇదిలావుండగా.అయోధ్యలో రామ్ లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం ముగిసింది.ప్రధాని నరేంద్ర మోడీ( PM Narendra Modi ) చేతుల మీదుగా మంగళ వాయిద్యాలు, వేదమంత్రాల మధ్య ప్రాణ్ ప్రతిష్ట కార్యక్రమం ముగిసింది.మధ్యాహ్నం 12.29 నిమిషాలకు అభిజిత్ లగ్నంలో బాలరాముడి ప్రాణ్ ప్రతిష్ట కార్యక్రమం జరిగింది.ప్రధాని మోడీ .బాలరాముడికి పట్టువస్త్రాలు, వెండి ఛత్రం సమర్పించారు.ఎడమ చేతిలో విల్లు, కుడిచేతిలో స్వర్ణాభరణాలు ధరించి చిరు దరహాసం, ప్రసన్నవదనంతో రాములవారు దర్శనమిచ్చారు.