ఎన్నారైకి చెందిన దుకాణంలో ముసుగు దొంగలు చోరీ.. భారీ నష్టంతో తల్లడిల్లుతున్న యజమాని..

తాజాగా న్యూజిలాండ్‌లో ( New Zealand ) ఒక ఎన్నారైకి చెందిన వేప్ స్టోర్‌లో( Vape store ) ముగ్గురు ముసుగు వ్యక్తులు చొరబడ్డారు.వారు NZ$8000 (దాదాపు రూ.4 లక్షలు) విలువైన వేప్ ఉత్పత్తులను దొంగిలించారు.చోరీ సమయంలో జరిగిన నష్టం కారణంగా యజమాని పావిక్ పటేల్( Pawik Patel ) తన దుకాణాన్ని తాత్కాలికంగా మూసివేయవలసి వచ్చింది.

 Ram-raiders Target Vape Store Owned By Indian-origin Man In New Zealand Details,-TeluguStop.com

సెక్యూరిటీ కెమెరా ఫుటేజీలో ముసుగు ధరించిన వ్యక్తులు దుకాణానికి వచ్చిన కారును చూపించింది.వారు తమ కారును షాప్ డోర్ బద్దలు కొట్టేందుకు దానిని బలంగా ఢీకొట్టారు.

చాలా బలంగా డ్యాష్ ఇవ్వడంతో స్టోర్ డోర్ పూర్తిగా ధ్వంసం అయ్యింది.

తరువాత, వారు స్టోర్ షెల్ఫ్‌ల నుంచి అనేక ఖరీదైన బ్రాండ్‌ల డిస్పోజబుల్ వేప్‌లను తీసుకున్నారు.దొంగలు తమకు ఏమి కావాలో తెలుసుకుని అత్యంత ఖరీదైన బ్రాండ్లను టార్గెట్ చేశారని పటేల్ పేర్కొన్నారు.దొంగిలించిన వస్తువుల విలువ కంటే దుకాణం మరమ్మతులకు ఎక్కువ ఖర్చు అవుతుందని వాపోయారు.

కొత్త డోర్ పెట్టించేందుకు డబ్బులు సమకూర్చుకోవడానికి పావిక్ పటేల్ ప్రయత్నిస్తున్నారు.వారాంతం వరకు దుకాణం మూసివేయాలని పటేల్ భావిస్తున్నారు.అతని కొత్త వేప్ స్టోర్‌ను టార్గెట్ చేయడం ఇదే మొదటిసారి.అయితే గతంలో పటేల్‌కు చెందిన ఇతర దుకాణంలో కూడా చోరీ జరిగింది.అయితే ఈసారి నష్టం ఎక్కువ ఉండటంతో అతను తల్లడిల్లుతున్నారు.మరోవైపు పోలీసులు ఈ ముసుగు దొంగలను పట్టుకునే పనిలో పడ్డారు.

సీసీటీవీ ఫుటేజ్ లో కనిపించిన వివరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.అలాగే వీలైనన్ని కోణాల్లో ఈ ఘటనను విచారిస్తూ దొంగలను త్వరగా పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube