రాజకీయంగా నిరూపించుకోవడానికి గత కొంతకాలంగా తీవ్రం గా ప్రయత్నిస్తున్న షర్మిలకు ఆ ప్రయత్నాలు అంతగా కలిసి రావడం లేదు.రాజశేఖర్ రెడ్డి వారసురాలుగా ఆమెకు కొంత సానుభూతి ఉన్నప్పటికీ అవి ఓట్లగా ఎంతవరకు మారతాయో తెలియని పరిస్థితిలో ఉంది .
అయితే ఆంధ్రప్రదేశ్లో తిరిగి బలపడాలనుకుంటున్న కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మాత్రం షర్మిలను ఒక అస్త్రంగా ఉపయోగించుకోవాలని చూస్తుందనే వాదనలు కూడా ఉన్నాయి.వైయస్ సానుభూతి ఓటింగ్ను షర్మిలద్వారా కాంగ్రెస్ వైపుకు ఆకర్షించాలనే వ్యూహంలో ఉన్న కాంగ్రెస్ వైఎస్ ఆర్ టి పి ని కాంగ్రెస్లో విలీనం చేసే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి.
అందుకు ముహూర్తం కూడా ఖరారు అయిందని చెబుతున్నారు.
అయితే తెలంగాణలో షర్మిల పార్టీని విలీనం చేసుకుని ఆమెకు ఆంధ్రప్రదేశ్లో బాధ్యతలు అప్ప చెప్పాలని పార్టీ హై కమాండ్ ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తుంది .ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు చేయడానికి షర్మిల ఇప్పటివరకు అయితే సుముఖంగా లేరు కానీ భవిష్యత్తులో ఏమైనా జరగొచ్చు.కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కనుక షర్మిలను ఆదేశిస్తే అప్పటి పరిస్థితులు బట్టి షర్మిల( Y.S.Sharmila ) కూడా ఒప్పుకోవచ్చునే ప్రచారం జరుగుతుంది .ఏ వైఎస్ ఫ్యామిలీ అయితే తమ ఓటు బ్యాంకు ను పూర్తిగా మాయం చేసిందో అదే ఫ్యామిలీతో తిరిగి ఆంధ్రప్రదేశ్లో పునర్జీవం పొందాలని చూస్తున్న కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆశలు ఏ మేరకు నెరవేరుతాయో చూడాలి.ఇప్పటికీ కాంగ్రెస్కు ఆంధ్రప్రదేశ్లో సానుభూతి ఓటింగ్ ఉందని భావిస్తున్న కాంగ్రెస్ అధిష్టానం రాజశేఖర్ రెడ్డి ( Y.S.Rajasekhara Reddy ) వారసురాలు ద్వారా వారందరినీ సంఘటితం చేయాలని భావిస్తుంది.
జూలై 8 వైఎస్సార్ జయంతి సందర్భంగా సోనియా గాంధీ( Sonia Gandhi )ని, రాహుల్ గాంధీని ఇడుపులపాయకు ఆహ్వానించడానికి తల్లి విజయమ్మతో కలిసి షర్మిల 10 జనపద్ కు వెళ్తారని వార్తలు వస్తున్నాయి ఇదే కనుక నిజమైతే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కొత్త సమీకరణానికి తేరలేసిందని భావించవచ్చు.జగన్ వదిలిన బాణంగా తనను తాను చెప్పుకున్న షర్మిల జగన్ పైకి అస్త్రంగా మారటానికి ఏ మేరకు అంగీకరిస్తుంది అన్నదే ప్రశ్న.