టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని కొత్త సినిమా “స్కంద”( Skanda ) ట్రైలర్ రిలీజ్ చేయడం జరిగింది.మాస్ డైరెక్టర్ బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో.
రామ్ పోతినేనికి( Ram Pothineni ) జంటగా హీరోయిన్ శ్రీలీల( Sreeleela ) నటించడం జరిగింది.శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి సినిమాని నిర్మించారు.
తమన్ సంగీతం అందించారు.సెప్టెంబర్ 15వ తారీకు ఈ సినిమా విడుదల కాబోతోంది.
తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ, హిందీ భాషలలో సినిమా విడుదల చేస్తున్నారు.దీంతో సినిమా యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలు వేగవంతం చేయడం జరిగింది.
దీనిలో భాగంగా ఆగస్టు 26వ తారీకు శనివారం సాయంత్రం హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది.ఈ కార్యక్రమానికి నటసింహం నందమూరి బాలయ్య బాబు ముఖ్యఅతిథిగా విచ్చేశారు.బాలకృష్ణ చేతుల మీదుగా “స్కంద” ట్రైలర్ రిలీజ్( Skanda Movie Trailer ) చేయడం జరిగింది.తెలంగాణ యాసలో ఓ రేంజ్ లెవెల్ మాస్ లో రామ్ పోతినేని డైలాగులు పలకడం జరిగింది.
బోయపాటి( Boyapati Srinivas ) మార్క్ ట్రైలర్ లో కనిపిస్తుంది.హైవోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలు.“స్కంద” ట్రైలర్ లో ఉన్నాయి.ట్రైలర్ లో సీనియర్ హీరో శ్రీకాంత్ సైతం అన్నారు.
పాన్ ఇండియా నేపథ్యంలో ఫస్ట్ టైం రామ్ పోతినేని నటించిన “స్కంద” ట్రైలర్.సినిమాపై అంచనాలను మరింతగా పెంచేసాయి.