ఎనర్జిటిక్ స్టార్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటుడు రామ్ పోతినేని( Ram Pothineni ) ఒకరు.ఈయన త్వరలోనే స్కంద సినిమా( Skanda ) ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.
బోయపాటి శ్రీను( Boyapati Sreenu ) దర్శకత్వంలో రామ్ నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 28వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది.ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా తాజాగా ఈయన ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.రామ్ సినిమాలు హిందీలో కూడా డబ్ అవుతూ విడుదలవుతుంటాయి.
తెలుగులో రామ్ తన సినిమాలకు ఆయనే డబ్బింగ్ చెప్పుకున్నప్పటికీ హిందీలో మాత్రం రామ్ పాత్రలకు సంకేత్ డబ్బింగ్ చెబుతారు.
ఇక స్కంద సినిమా విడుదలవుతున్నటువంటి సందర్భంలో రామ్ ను సంకేత్ ఇంటర్వ్యూ చేశారు.ఈ ఇంటర్వ్యూలో భాగంగా ఈయన ఎన్నో విషయాలను వెల్లడించారు.ఇక సోషల్ మీడియాలో మిమ్మల్ని క్రికెటర్ తో కంపేర్ చేస్తూ పోస్టులు చేస్తుంటారు మీరు ఎప్పుడైనా గమనించారా అంటూ సంకేత్ ప్రశ్నించారు.
ఈ ప్రశ్నకు రామ్ సమాధానం చెబుతూ.ఇస్మార్ట్ శంకర్ సినిమా లుక్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసినప్పటి నుంచి ఇలాంటి కంపారిజన్ వస్తున్నాయని రామ్ తెలిపారు.ముఖ్యంగా మీరు విరాట్ కోహ్లీ ( Virat Kohli ) లాగే ఉంటారు అంటూ సంకేత్ చెప్పడమే కాకుండా ఒకవేళ విరాట్ కోహ్లీ బయోపిక్ లో నటించే అవకాశం వస్తే అంటూ ప్రశ్నించారు.
ఈ ప్రశ్నకు రామ్ సమాధానం చెబుతూ విరాట్ కోహ్లీ బయోపిక్ చేసే అవకాశం వస్తే తప్పకుండా చేస్తానని ఈయన వెల్లడించారు.విరాట్ బయోపిక్ అంటే ఎగ్జైటింగ్ కదా అని అన్నారు.ఇక హిందీలో మీ సినిమాకు వచ్చే వ్యూస్ చూసినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది అని ప్రశ్నించగా కొన్ని సినిమాలు తెలుగులో కూడా సక్సెస్ కాని విధంగా హిందీలో సక్సెస్ అవుతున్నాయని, ఇలా హిందీ ప్రేక్షకులు నాపై చూపించే ప్రేమకు నాకు మరింత బాధ్యత పెరిగింది అంటూ ఈ సందర్భంగా రామ్ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.