క్షణం క్షణం సినిమా రామ్ గోపాల్ వర్మ శ్రీదేవి కి రాసుకున్న ప్రేమలేక అని తన పుస్తకం అయినా నా ఇష్టం లో రాసుకున్నాడు.తనను ఇంప్రెస్స్ చేయడానికి, ఒక్కసారైనా తనను కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడాలని తపించేవాడు.
కాలేజీ రోజుల నుంచి శ్రీదేవి అంటే వర్మ కు మహా ఇష్టం.ఆ ఇష్టం పెరిగి పెద్దయ్యింది తనకు సినిమా పిచ్చి కూడా ఆ మూలంగానే పట్టుకుంది.
ఇక శ్రీదేవి సినిమా లో నటించేప్పుడు కన్నా కూడా ఆమె మాములు సమయంలో ఎలా ఉంటుందో తెలుసుకోవాలని కూడా వర్మ తహతహలాడేవాడు.ఆమె ఎప్పుడు తన చుట్టూ ఒక గోడ కట్టుకొని ఆ ప్రపంచంలోకి ఎవరిని రాణించేది కాదు.
అందుకే వర్మలో శ్రీదేవి పై ఇష్టం మరింత పెరిగింది.
ఇక రామ్ గోపాల్ వర్మ క్షణం క్షణం సినిమా తీస్తున్నప్పుడు ఒక గమ్మత్తయిన సంఘటన జరిగింది.కెమెరా లో శ్రీదేవి ఉన్నప్పుడు పక్కన ఎవరు ఉన్న, ఏం జరిగిన వర్మకు ఎక్కేది కాదు.ఆ చిత్రం లో అందనంత ఎత్తా తార తీరం అనే షూటింగ్ జరుగుతుంది.
ఈ చిత్రానికి డ్యాన్స్ మాస్టర్ గా సుందరం మాస్టారు పని చేసారు.వెంకటేష్, శ్రీదేవి డ్యాన్స్ చేస్తున్న సమయంలో ఒక షాట్ అయిపోగానే వర్మ సూపర్, ఫెంటాస్టిక్ అని చెప్పారు.
కానీ సుందరం మాస్టారు మాత్రం ఇంకో టేక్ చేద్దాం అని అన్నారు.ఆ టెక్ కూడా పూర్తయ్యాక వర్మ మల్లి సూపర్ సూపర్ అంటున్నాడు కానీ సుందరం మాస్టారు మాత్రం రీటెక్ అంటున్నాడు.
అంత బాగా షాట్ వచ్చింది కానీ డ్యాన్స్ మాస్టర్ మతం మల్లి ఎందుకు తీయాలి అనుకుంటున్నాడో వర్మకు అర్ధం కాలేదు.
అప్పుడు వర్మ అసిస్టెంట్ ఒకతను వచ్చి సర్ మీరు శ్రీదేవిని చూస్తున్నారు సుందరం మాస్టారు వెంకటేష్ ని చూస్తున్నారు అని అన్నాడు.అంటే శ్రీదేవి ఫ్రెమ్ లో ఉంటె పక్కన ఎంత పెద్ద స్టార్ ఉన్నప్పటికీ వర్మ కళ్ళు కేవలం ఆమెను మాత్రమే చూస్తాయి.వర్మ మాత్రమే కాదు ఆ సినిమా విడుదల అయ్యాక లక్షలాది అభిమానుల కళ్ళు కూడా కేవలం శ్రీదేవిని చూశాయి.
ఆ సినిమాలోని మిగతా పాటల్లో కూడా అందరు ఊటీ, కోడై కెనాల్ అందాలు చూపించాలని అనుకున్న శ్రీదేవి కనిపిస్తుంటే ఇంకా లోయలు, కొండలు ఎందుకు అండి అంటదు వర్మ.