70 మంది అమెరికన్లతో ఒక ఇండియా పౌరుడు సమానం అంటున్న ఆర్జీవీ...

ఎప్పుడూ సరికొత్త కథనాలను ఎంచుకుంటూ, విభిన్న చిత్రాలతో ప్రేక్షకులను అలరించేటువంటి వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి తెలియని వారుండరు.అయితే జీవితంలో తాను అనుకున్నది అనుకున్నట్లుగా చేస్తూ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా జీవితాన్ని ఆస్వాదించే అతి తక్కువ మందిలో రాంగోపాల్ వర్మ ఎప్పుడూ ముందు వరుసలో ఉంటారు.

 Ram Gopal Varma Satirical Tweet Goes Viral In Social Media-TeluguStop.com

అయితే తాజాగా రామ్ గోపాల్ వర్మ చేసినటువంటి ఓ ట్వీట్ ప్రస్తుతం నెట్ లో వైరల్ అవుతుంది.

తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పర్యటన నిమిత్తం భారత దేశానికి వచ్చిన సంగతి తెలిసిందే.

అయితే ఇందులో భాగంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అహ్మదాబాద్ నగరంలో ఉన్నటువంటి మోతేరా స్టేడియంలో ఘనంగా సభను కూడా ఏర్పాటు చేశారు.ఈ సభకు దాదాపుగా లక్ష మందికి పైగా జనాలు హాజరయ్యారు.

ఈ సభకి సమబందించి తాజాగా రామ్ గోపాల్ వర్మ ప్రధానమంత్రి మోడీ మరియు ట్రంప్ ల మధ్య చిన్నపాటి సంభాషణను సృష్టించాడు.

ట్రంప్….మోడీ నాకు ఘన స్వాగతం పలికేందుకు దాదాపుగా 70 లక్షల మందికి పైగా వస్తానని చెప్పావు. మరి లక్ష మంది మాత్రమే వచ్చారెంటి అని అడుగుతాడు.

అయితే  ఇందుకు భారతదేశ ప్రధానమంత్రి మోడీ సమాధానం చెబుతూ 70 రూపాయలు ఒక డాలర్ కి ఎలాగ సమానమో, అలాగే ఒక గుజరాతి పౌరుడు కూడా 70 మంది అమెరికన్లకు సమానం అంటూ సెటైరికల్ గా సమాధానం చెబుతాడు.ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట్లో బాగానే వైరల్ అవుతోంది.

అయితే సోషల్ మీడియా వేదికగా ప్రముఖుల్ని మరియు తప్పు చేసిన వారిని అసలు వదిలిపెట్టని రామ్ గోపాల్ వర్మ ఈసారి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై పడ్డాడు.దీంతో మరీ ట్వీట్ పై మోడీ లేదా డోనాల్డ్ ట్రంప్ ఎలా స్పందిస్తారో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube