కన్నడ చిత్ర పరిశ్రమలో హీరోగా మంచి సక్సెస్ అందుకున్నటువంటి రక్షిత్ శెట్టి( Rakshith Shetty ) తెలుగు చిత్ర పరిశ్రమకు కూడా ఎంతో సపరిచితమే ఈయన కన్నడలో నటించిన సినిమాలన్నీ కూడా తెలుగులో కూడా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.ఇలా తెలుగులో కూడా రక్షితశెట్టికి మంచి ఆదరణ లభించింది తాజాగా ఈయన నటించిన చార్లీ 777 సినిమా తెలుగులో ఎంతో మంచి సక్సెస్ అందుకున్న విషయం మనకు తెలిసిందే.
తాజాగా రక్షిత శెట్టి నటించినటువంటి ఒక సినిమాని తెలుగులో డబ్ చేయబోతున్నారు.ఈ సినిమాకు సప్త స్వరాలు దాటి ( Sapta Sagaralu Dhaate ) అనే టైటిల్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఇక ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చే ప్రేక్షకులను సందడి చేస్తుంది.అయితే ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా హైదరాబాద్ వచ్చినటువంటి రక్షిత్ శెట్టి ఇక్కడ పలు మీడియా ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సందడి చేశారు.ఈ క్రమంలోనే రక్షిత్ శెట్టి కన్నడ దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్( Puneeth Rajkumar ) గురించి పలు విషయాలను తెలియజేస్తూ ఎమోషనల్ అయ్యారు.పునీత్ రాజ్ కుమార్ కన్నడ చిత్ర పరిశ్రమలో నటుడుగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న సంగతి మనకు తెలిసిందే.
ఇక ఈయన జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ హార్ట్ స్ట్రోక్ రావడంతో మరణించారు.ఈయన మరణించి దాదాపు మూడు సంవత్సరాలు అవుతున్నప్పటికీ అభిమానులు కన్నడ చిత్ర పరిశ్రమ ఈయన మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.తాజాగా రక్షిత్ ఈయన మరణం గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు.ఆయన ఎంతో గొప్ప నటుడని ఆయన మరణం ఇండస్ట్రీకి తీరని లోటు అని తెలియజేశారు.ఇక తన సినిమా మాత్రమే కాకుండా కన్నడ చిత్ర పరిశ్రమలో ప్రతి ఒక్క సినిమా కూడా పునీత్ రాజ్ కుమార్ గారికి అంకితం అంటూ ఈ సందర్భంగా రక్షిత శెట్టి ఎమోషనల్ అయ్యారు.