చనిపోయిన అన్న మృతదేహానికి రాఖీ కట్టిన చెల్లెలు.. గుండెలవిసేలా రోదిస్తూ?

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు, రేపు రాఖీ పండుగను చాలామంది ఎంతో సంతోషంగా జరుపుకుంటున్నారు.అక్కాచెల్లెళ్లు తమ సోదరులకు రాఖీ కట్టి సోదరులపై ప్రేమను చాటుకుంటున్నారు.

 Rakhi Festival Sister Tied Rakhi To Brother Who Died Of Heart Attack In Peddapal-TeluguStop.com

రాఖీ పండుగను కొంతమంది ఈరోజు జరుపుకుంటుండగా మరి కొందరు రేపు జరుపుకుంటున్నారు.సోదరులకు రాఖీ కట్టాలని తెలుగు రాష్ట్రాల్లోని చాలామంది అక్కాచెల్లెళ్లు తమ సొంతూళ్లకు చేరుకుంటున్నారు.

అయితే రాఖీ పండుగ ( Rakhi festival )రోజున పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలంలో చోటు చేసుకున్న విషాదం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఎలిగేడు మండలంలోని ధూళికట్టకు చెందిన చౌదరి కనకయ్య ఈరోజు గుండెపోటుతో మృతి చెందారు.

అన్నకు రాఖీ కట్టాలని వచ్చిన చెల్లెలు గౌరమ్మ ( Gouramma )అన్న మరణ వార్త విని గుండెలవిసేలా రోదించారు.సంతోషంగా రాఖీ పండుగను జరుపుకోవాలని భావించిన గౌరమ్మ అన్న మరణ వార్త విని పుట్టెడు దుఃఖంలో మునిగిపోయారు.

తన సోదరుడు విగతజీవిగా మారడాన్ని చూసి ఆమె తట్టుకోలేకపోయారు.చౌదరి కనకయ్య( Chaudhary Kanakaiah ) మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.ఈ ఘటన గ్రామంలోని ఎంతోమందిని కన్నీళ్లు పెట్టింది.

Telugu Gauramma, Gouramma, Peddapalli, Rakhi Festival-General-Telugu

గౌరమ్మను ఓదార్చడం ఎవరి వల్ల కావడం లేదు.అన్నకు రాఖీ కట్టాలని ఆనందంగా వచ్చిన చెల్లి పెను విషాదం చోటు చేసుకోవడంతో అన్న మృతదేహానికి రాఖీ కట్టారు.తిరిగిరాని లోకాలకు అన్న వెళ్లిపోయాడనే విషయం తెలిసి తట్టుకోలేకపోతున్నానని ఆమె చెబుతున్నారు.

పండుగను సంతోషంగా జరుపుకోవాలని భావించిన గౌరమ్మ సోదరుడి మృతిని తట్టుకోలేక కన్నీరుమున్నీరుగా విలపించారు.

Telugu Gauramma, Gouramma, Peddapalli, Rakhi Festival-General-Telugu

చౌదరి కనకయ్యను ఆస్పత్రికి తీసుకెళ్లే లోపు మృతి చెందారని తెలుస్తోంది.గ్రామంలో చౌదరి కనకయ్యకు రైతుగా మంచి పేరు ఉండేదని సమాచారం అందుతోంది.గౌరమ్మ రోదిస్తూ కనకయ్య మృతదేహానికి రాఖీ కట్టడంతో గ్రామస్తులు సైతం కన్నీటి పర్యంతమయ్యారు.

చౌదరి కనకయ్య ఇతరులకు సహాయం చేసే విషయంలో ముందువరసలో ఉండేవారని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube