ఈ మధ్య కాలం లో తమిళ్ సినీ ఇండస్ట్రీ తో పాటు పాన్ ఇండియా రేంజ్ లో ప్రముఖంగా వినిపిస్తోన్న పేరు లోకేష్ కనగరాజ్( Lokesh Kanagaraj ).ఈ దర్శకుడు తాజాగా లియో అనే సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే.
సూపర్ స్టార్ విజయ్ హీరో గా రూపొందిన లియో సినిమా( Leo Movie ) బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయి లో విజయాన్ని సొంతం చేసుకోవడం లో విఫలం అయింది.విజయ్ ఫ్యాన్స్ వెయ్యి కోట్లు అంటూ చాలా బలంగా నమ్ముకున్నారు.
కానీ అందులో సగం అయినా వసూళ్లు నమోదు అయ్యాయా అంటే లేదు అనే సమాధానం లభిస్తోంది.ఇలాంటి పరిస్థితుల్లో లోకేష్ కనగరాజ్ తదుపరి సినిమా ఎలా ఉంటుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం విక్రమ్ కథ తో లింక్ ఉండేలా రజినీకాంత్( Rajinikanth ) తో రూపొందించబోతున్న సినిమా ఉంటుంది అంటూ లోకేష్ సన్నిహితులు చెబుతున్నారు.యూనివర్శిల్ స్టార్ కమల్ హాసన్( Kamal Haasan ) హీరోగా వచ్చిన విక్రమ్ సినిమా దాదాపుగా అయిదు వందల కోట్ల వసూళ్లు నమోదు చేసింది.కమల్ కి పదేళ్ల తర్వాత సాలిడ్ కమర్షియల్ సక్సెస్ ఈ సినిమా తో దక్కింది.అందుకే లోకేష్ కనగరాజ్ ఇప్పుడు విక్రమ్ కథ తో లింక్ పెట్టి రజినీకాంత్ కోసం కథ ను రెడీ చేసుకున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం విక్రమ్( Vikram ) పాత్ర ను దాదాపు అయిదు నుంచి ఏడు నిమిషాల పాటు లోకేష్ చూపించాలని భావిస్తున్నాడు.అందుకోసం కమల్ తో సంప్రదింపులు జరిగాయని తెలుస్తోంది.మొత్తానికి రజినీకాంత్ తో లోకేష్ చేయబోతున్న సినిమా కి విక్రమ్ తో సంబంధం ఉంటుంది, అలాగే విక్రమ్ ఆ సినిమా లో కనిపించబోతున్నాడు అన్నమాట.రజినీ తో సినిమా తర్వాత ఖైదీ 2 సినిమా ను లోకేష్ చేయబోతున్న విషయం తెల్సిందే.