ఎవ్వరినీ నొప్పించకుండా అందరినీ మెప్పించుకుంటూ వెళ్ళడమే లౌక్యం అన్నమాట.పది కాలాల పాటు టాలీవుడ్ లాంటి సినిమా పరిశ్రమలో ఉండాలి అంటే అలా ఉండి తీరాలి మరి.
ప్రముఖ దర్శకుడు రాజమౌళికి ఈ సంగతి బాగా తెలుసు.అందుకే ఆయన నోటి వెంట లేదా ట్వీట్ల వెంట మంచి మాటలు తప్ప మరొకటి రావు.
విమర్శల జోలికి ఆయన పోరు.ఎన్టీఆర్ కి చాలా సన్నిహితుడు అయిన రాజమౌళి నాన్నకు ప్రేమతో ట్రైలర్ చూడగానే అదిరిపోయింది అంటూ ట్వీట్ వేసాడు.
సుకుమార్ తన
ఫేవరేట్ డైరెక్టర్ అని కూడా చెప్పుకొచ్చాడు .
కానీ సినిమా విడుదల అయిన తరవాత ఒక్కటంటే ఒక్క మాట కూడా మాట్లాడలేదు.దీనిని ఎలా అర్ధం చేసుకోవాలి ? రాజమౌళీ కి సినిమా నచ్చలేదు అనా మరేదైనా కారణం ఉండచ్చా ? నాగ్ తో కూడా మంచి అనుబంధం వుంది.ఆయన సినిమా కూడా పెద్ద విజయం సాధించింది.
మరి దానికి కూడా ట్వీట్ చేయాలి కదా.ఇంకోపక్క తన బాహుబలి హీరో.ప్రభాస్.ఆయన స్వంతబ్యానర్ సినిమా.ఎక్స్ ప్రెస్ రాజా.అది కూడా హిట్టే.
దాని సంగతి కూడా చూడాలి.సో ఇన్ని సినిమాల గురించి మాట్లాడుతూ బాలకృష్ణని ఇగ్నోర్ చెయ్యలేం కదా.అన్ని సినిమాల గురించీ మాట్లాడుతూ రివ్యూలు ఇవ్వడం జక్కన్న కి ఇష్టం లేదన్నమాట అందుకే సైలెంట్ గా ఉన్నారు అంటున్నారు.లేదా నాన్నకు ప్రేమతో ఆయనకి నచ్చకపోయి ఉండచ్చు కూడా.