తండ్రి పంజాబ్‌లో ఏఐజీ .. కెనడియన్ పోలీస్ విభాగంలో కొడుకు, ఇది కదా పుత్రోత్సాహమంటే..!!

కొడుకు పుట్టగానే కాదు.అతని ప్రతిభ గురించి నలుగురు చెప్పినప్పుడే తండ్రికి నిజమైన పుత్రోత్సాహం అంటారు పెద్దలు.

 Punjab Police Aig Son Selected To Serve In Canadian Police Department Details, P-TeluguStop.com

అలా తండ్రి గర్వపడే స్థాయికి చేరుకున్న కొడుకులకు ఇదే మా సెల్యూట్.సాధారణంగా తండ్రి ఏ ఉద్యోగం / వ్యాపారం చేస్తే కొడుకు కూడా ఆయననే ఫాలో అవుతూ వుంటాడు.

ఈ విషయం ఎందరి జీవితాల్లోనో, ఎన్నోసార్లు రుజువు అయ్యింది.ఇదిలావుండగా.

పంజాబ్ పోలీస్‌ శాఖలో అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్ జనరల్ (ఏఐజీ)గా( Punjab AIG ) పనిచేస్తున్న నరేశ్ డోగ్రా( Naresh Dogra ) కుమారుడు అనీష్ డోగ్రా( Anish Dogra ) కెనడియన్ పోలీస్ శాఖలో ఉద్యోగం సంపాదించి రాష్ట్రానికి , దేశానికి గర్వకారణంగా నిలిచాడు.

Telugu Anish Dogra, Canada, Canadiancop, Canadian, Naresh Dogra, Punjab Aig, Pun

తన కుమారుడు సాధించిన విజయం పట్ల నరేష్ డోగ్రా హర్షం వ్యక్తం చేశారు.తన బిడ్డ తనను గర్వపడేలా చేయడమే కాకుండా పంజాబ్‌ రాష్ట్రానికి, భారతదేశానికి కూడా పేరు తెచ్చాడని ఏఐజీ వ్యాఖ్యానించారు.అంకితభావం, కృషి వల్లనే అనీష్ ఈ స్థాయికి చేరుకున్నాడని తెలిపారు.

పంజాబ్ పోలీస్ శాఖలో తాను నిబద్ధతతో పనిచేశానని.ఇప్పుడు విదేశీ గడ్డపైనా అనీష్ తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలని నరేష్ ఆకాంక్షించారు.

Telugu Anish Dogra, Canada, Canadiancop, Canadian, Naresh Dogra, Punjab Aig, Pun

ప్రస్తుతం పీఏపీలో విధులు నిర్వర్తిస్తున్నారు నరేష్.చిన్నప్పటి నుంచి తన తండ్రినే చూస్తూ పెరిగిన అనీష్.తొలుత బాడీ బిల్డింగ్ పోటీల్లో పాల్గొంటూ వచ్చాడు.ఈ క్రమంలోనే బాడీ బిల్డింగ్ విభాగంలో ‘‘మిస్టర్ పంజాబ్’’ టైటిల్‌ను గెలుచుకున్నాడు.క్రీడల్లో సత్తా చాటుతూనే రూపనగర్ నుంచి బీడీఎస్‌లో పట్టా పొందాడు అనీష్.ఈ నేపథ్యంలో అతనికి అమెరికాకు చెందిన ఓ కంపెనీలో ఉద్యోగం వచ్చింది.

అయితే పోలీస్ శాఖలో పనిచేయాలని అనీష్‌కు చిన్నప్పటి నుంచి కల.అందుకోసం అమెరికాకు కాకుండా కెనడాకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు.కెనడాలో( Canada ) కఠినమైన పోలీస్ పరీక్షలో ప్రతిభ కనబరిచి, కెనడియన్ పోలీస్ ఫోర్స్‌లో మంచి పోస్ట్ సంపాదించాడు.ఏడాది ఇంటెన్సివ్ శిక్షణ తర్వాత .ఆయన మూడు నెలల క్రితం విధుల్లోకి చేరాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube