అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం( All India Democratic Women’s Association ) ఐద్వా ఉమ్మడి ఖమ్మం, నల్గొండ ,వరంగల్, జిల్లాల రాష్ట్ర జోనల్ క్లాసులు ఖమ్మం సుందరయ్య భవన్లో ప్రారంభమయ్యాయి.నేటి నుండి మూడు రోజులు పాటు జరగనున్నాయి ఐద్వా ఖమ్మం జిల్లా నాయకురాలు( Aidwa ) మాచర్ల భారతి అధ్యక్షతన ప్రారంభసభ జరిగింది.ఈ సభలో ఐద్వా రాష్ట్ర కార్యదర్శి మల్లు లక్ష్మి మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చాక దేశంలో మహిళలపై లైంగిక వేధింపులు పెరిగాయన్నారు.2014 ముందు నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ధరలు పెంచుతుందని గగ్గోలు పెట్టి అధికారంలోకి వచ్చిన బిజెపి అన్ని నిత్యవసర వస్తువుల ధరలను పెంచి సామాన్య మానవునికి అందుబాటులో లేకుండా చేసిందని ధరలు పెరగడం వల్ల అనేకమంది మహిళలు పోషక పదార్థాలు తినక జబ్బుల బారిన పడి మరణిస్తున్నారని ఆమె ఆవేదన వెలిబుచ్చారు.సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పిన నరేంద్ర మోడీ గారు ప్రభుత్వ రంగాన్ని మొత్తాన్ని ప్రైవేటు వాళ్లకు అప్పజెప్పితే ఉన్న ఉద్యోగాలనే పీకేస్తున్నారని ఆమె ఆందోళన వెలిగించారు.
80 కోట్ల నల్లధనాన్ని తెచ్చి పేదల జన్ ,ధన్ ఖాతాలో వేస్తానని చెప్పిన మోడీ ఒక్క రూపాయి కూడా నల్లధనాన్ని గుర్తించలేదన్నారు.పేదల ఖాతాలో ఒక్క రూపాయి కూడా వేయలేదు అన్నారు.2020 నాటికి పేదలందరికీ ఆవాస్ యోజన కింద ఇల్లు కట్టిస్తానని చెప్పిన మోడీ ఎక్కడ ఒక ఇల్లు కూడా మంజూరు చేయలేదని ఆమె అన్నారు.బిజెపి పాలిత రాష్ట్రాల్లో మహిళలపై అత్యాచారాలు, హత్యలు ,వేధింపులు, పెరుగుతున్నాయని, ఆమె ఆందోళన వెలిబుచ్చారు .మహిళలు కట్టుకునే బట్టల వల్లనే అత్యాచారాలు జరుగుతున్నాయని, బిజెపి ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, మాట్లాడుతున్నారని అత్రాసులో నిండుగా బట్టలు కట్టుకొని చేను పనికి వెళ్ళిన మహిళను ఎత్తుకెళ్లి అత్యాచారం చేసి హత్య చేస్తే శవాన్ని కూడా తల్లిదండ్రులకు ఇవ్వకుండా దానం చేసిన చరిత్ర బిజెపి పాలన రాష్ట్రంలో ఉందని ఆమె అన్నారు.
బేటి బచావో, బేటి పడావో, అంటున్న మోడీ నేడు గత 60 రోజులుగా ఢిల్లీ నడిబొడ్డున ఆందోళన నిర్వహిస్తున్న మహిళా రెజ్లర్లు పై బిజెపి ఎంపీ బ్రిడ్జ్ భూషణ్ శరణ్ సింగ్ ,లైంగిక వేధింపుల పట్ల మాట్లాడకపోవడం ఆయన భేటీల పట్ల వివక్ష అర్థమవుతుందన్నారు.ఒలింపిక్స్ లో మెడల్స్ తెచ్చిన మహిళలకే రక్షణ లేకపోతే సాధారణ మహిళలకు ఏ రకంగా రక్షణ కల్పిస్తారని ఆమె కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
రెజ్లర్ల న్యాయ పోరాటానికి ఐద్వా అండగా ఉంటుందని మోడీ ఇప్పటికైనా వారికి న్యాయం చేయడానికి ముందుకు రావాలని వెంటనే లైంగిక దాడికి పాల్పడ్డ బ్రిడ్జిభూషణ్ ను పదవి నుండి తొలగించి చట్టప్రకారం శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు.భారత పార్లమెంట్ భవనం ప్రారంభానికి భారత రాష్ట్రపతిగా ఉన్న మహిళతో ప్రారంభించకుండా మహిళలను అణగదొక్కుతున్నారని ఆమె అన్నారు.
మహిళల పట్ల మోడీకున్న గౌరవం ఏమిటో అర్థమవుతుందని ఆమె అన్నారు.
మహిళలకు, పేదలకు,రక్షణ కల్పిస్తూ ప్రత్యామ్నాయ విధానాలతో అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్న కేరళలో అల్లర్లు సృష్టించడానికి కేరళ స్టోరీ పేరుతో 32 వేల మందిని క్రిస్టియన్లుగా మార్చి మాయ చేశారని అబద్ధాలు అల్లుతున్నారని ఆమె అన్నారు .రుజువు చేయమని అడిగితే కేవలం ముగ్గురు మాత్రమే తేలారని బిజెపి ఆర్ఎస్ఎస్ అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని ఆమె దుయబెట్టారు.ఇటీవల త్రిపురలో నెల రోజుల్లోనే 15 మంది మహిళలపై బిజెపి వారు అత్యాచారాలు చేశారని వారిలో ఇద్దరు గిరిజన మహిళలు కూడా అన్నారన్నారు.
వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా బీజేపీ కాపాడుతుందని రాజ్యాంగ వ్యవస్థలను బిజెపి పాలకులు తుంగలో తొక్కుతుందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.
ఆర్ఎస్ఎస్ నిధి నిషేధించాలని డిమాండ్ చేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ ని రాజకీయ ప్రయోజనం కోసం నేడు తెరమీదకి తెస్తుందని గాంధీని చంపిన గాడ్సేను బిజెపి పూజించాలని ఆదేశిస్తుందని ఇది బిజెపి ఆర్ఎస్ఎస్ నిజస్వరూపం అని ఆమె అన్నారు.
అన్ని రంగాల్లో స్త్రీలను తక్కువ చేసి చూపే ప్రయత్నం బిజెపి చేస్తుందని అందులో భాగంగానే ప్రజాప్రతినిధులుగా ఉన్న బిజెపి ప్రముఖులు మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడుతున్నారని ఆమె విమర్శించారు.వీరి తప్పులను ప్రశ్నించిన దబోల్కర్ ,పన్సారే ,లాంటి వారిని హత్య చేశారని, గవర్నర్లను ఉపయోగించి రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తున్నారని, ఆమె విమర్శించారు.
మహిళలకు, పేదలకు ,వ్యతిరేకంగా ఉన్న కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా మహిళలు ఉద్యమించాల్సిన అవసరం ఉందని ఆమె పిలుపునిచ్చారు.
రాష్ట్రంలో అనేక మంది పేదలు ఇల్లు లేక స్థలాలు లేక బాధపడుతున్నారని ఇప్పటికే మూడు లక్షల మంది డబల్ బెడ్ రూమ్ ల కోసం దరఖాస్తు చేసుకున్నారని 40 వేల మంది ఇళ్ల స్థలాల కోసం అడుగుతున్నారని వెంటనే వారందరికీ రాష్ట్ర ప్రభుత్వం స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టిఇయాలని ఆమె డిమాండ్ చేశారు.
మహిళల రక్షణ సాధికారిక కోసం చట్టసభలలో 33 శాతం రిజర్వేషన్లు తేవాలని ఆమె డిమాండ్ చేశారు.చిత్తశుద్ధి ఉంటే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ఆమె అన్నారు.
అనంతరం బుగ్గ వీటి సరళ ప్రిన్సిపాల్ గా, తెలంగాణ ప్రజా పోరాటం మహిళల పాత్ర పాఠాన్ని బత్తుల హైమావతి గారు బోధించారు.ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా అధ్యక్షులు బండి పద్మ గారు ,సంఘం రాష్ట్ర నాయకురాలు అప్రోస్ సమీనా గారు, ప్రభావతి , ఎం రమణ , పయ్యావుల ప్రభావతి, నాగ, సులోచన, ,మెహ్రునిసా బేగం, కృష్ణవేణి ,తదితరులు పాల్గొన్నారు
.






