నిర్లక్ష్యంగా కారు నడిపి ఇద్దరు మహిళల మరణానికి కారణమైన భారత్‌కు చెందిన వ్యక్తిని కెనడా ప్రభుత్వం( Canada Govt ) దేశం నుంచి బహిష్కరించింది.నిందితుడిని బిపిన్‌జోత్ గిల్‌గా( Bipinjot Gill ) గుర్తించారు.
భారత్‌లోని పంజాబ్ రాష్ట్రానికి చెందిన ఇతను స్టూడెంట్ వీసాపై 2016లో కెనడాకు వచ్చాడు.ఈ క్రమంలో మే 18, 2019న కాల్గరీలో అతని కారు ఢీకొట్టిన ఘటనలో ఉజ్మా అఫ్జట్ (31),( Uzma Afzal ) ఆమె తల్లి బిల్క్యూస్ బేగం (65)( Bilquees Begum ) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
దేశ బహిష్కరణ ఉత్తర్వులను నిలిపివేసేందుకు చేసిన ప్రయత్నాలను ఫెడరల్ కోర్ట్ న్యాయమూర్తి ఈ నెలలో తిరస్కరించడంతో గిల్ .కెనడాను విడిచిపెట్టినట్లుగా కాల్గరీ హెరాల్డ్ వార్తాపత్రిక నివేదించింది.నిందితుడు తీవ్రమైన నేరానికి పాల్పడ్డాడని, అతని కారణంగా రెండు విలువైన ప్రాణాలు పోయాయని, బాధిత కుటుంబాలకు ఆపార నష్టం జరిగిందని న్యాయమూర్తి షిర్జాడ్ అహ్మద్ తన తీర్పులో పేర్కొన్నారు.
అతను తన మానసిక ఆరోగ్య సమస్యలకు చికిత్స పొందలేక భారతదేశానికి( India ) తిరిగి వెళ్తే.తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని గిల్ చేసిన వాదనలను న్యాయమూర్తి తిరస్కరించారు.ప్రమాదం జరిగిన సమయంలో 21 ఏళ్ల గిల్.
మే 18, 2019 తెల్లవారుజామున మెటిస్ ట్రైల్,( Metis Trail ) 128 అవెన్యూ ఎన్ఈ జంక్షన్ వద్ద తన హ్యుండాయ్ కారుతో టయోటా కరోలాను ఢీకొట్టాడు.ఈ ఘటనలో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందగా.
డ్రైవర్, బేగం , ఉజ్మా భర్తల పరిస్థితి విషమంగా వుండటంతో ఆసుపత్రికి తరలించారు.
ఏప్రిల్ 2023లో ఈ జంట మరణాల కేసులో గిల్‌ను న్యాయస్థానం దోషిగా నిర్ధారించింది.నవంబర్‌లో గృహ నిర్బంధం, 300 గంటల సమాజ సేవ, ఏడాది పరిశీలనలో వుండాలని కోర్టు శిక్ష విధించింది.ప్రమాదం( Accident ) జరిగిన మూడు నెలల తర్వాత.
ఆగస్ట్ 2019లో గిల్ ర్యాష్ డ్రైవింగ్, ఘటనాస్థలి నుంచి పారిపోయినట్లుగా తేలింది.దీంతో సెప్టెంబర్ 6, 2022న గిల్‌కు దేశ బహిష్కరణ విధించారు.
గిల్ న్యాయవాది అతని క్లయింట్ బహిష్కరణ ఆర్డర్‌పై స్టే తెచ్చేందుకు ఎంతో ప్రయత్నించారు.