విదేశాల్లో చిక్కుకున్న పంజాబీలు క్షేమంగా స్వదేశానికి తిరిగి రావడానికి పంజాబ్ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు ఆ రాష్ట్ర ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కుల్‌దీప్ సింగ్ ధాలివాల్ ( Kuldeep Singh Dhaliwal ) తెలిపారు.వీసాల పేరుతో యువతను మోసం చేస్తున్న ట్రావెల్ ఏజెంట్లపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని ఆయన హెచ్చరించారు.
ఇలాంటి ట్రావెల్ ఏజెంట్ల జాబితాను ఎన్ఆర్ఐ శాఖ ఇప్పటికే సిద్ధం చేసిందని.మోసపూరిత వ్యాపారాలకు పాల్పడే ఏజెంట్లకు హెచ్చరికలు జారీ చేసినట్లు చెప్పారు.
కాగా.నకిలీ విద్యార్ధి వీసాలు, అడ్మిషన్ లెటర్స్ కుంభకోణానికి గాను భారత్‌లోని పంజాబ్‌కు చెందిన బ్రిజేష్ మిశ్రా( Brajesh Mishra)ను కెనడా బోర్డర్ సర్వీసస్ ఏజెన్సీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.వందలాది మంది విద్యార్ధులకు నకిలీ ఆఫర్ లెటర్‌లను ఇచ్చిన ఆరోపణలపై అతనిపై ఇప్పటికే పంజాబ్‌లో 12 ఫిర్యాదులు వున్నాయి.2021 నుంచి 2023 మధ్య కాలంలో దాఖలైన ఈ 12 ఫిర్యాదుల్లో ఆరింటిని ఎఫ్ఐఆర్‌లుగా మార్చారు పోలీసులు.అయితే బ్రిజేష్ ఈ కేసుల్లో అరెస్ట్‌ల నుంచి తప్పించుకోగలిగాడు.కానీ కెనడాలో 700 మంది విద్యార్ధులు బహిష్కరణ ముప్పును ఎదుర్కోవడంతో బ్రిజేష్ ఒక్కసారిగా వార్తల్లోకెక్కాడు.
ఇకపోతే.ఇటీవల దుబాయ్( Dubai )లో ఓ ట్రావెల్ ఏజెంట్ వద్ద బందీగా వున్న పంజాబీ మహిళ అతని చెర నుంచి బయటపడింది.వివరాల్లోకి వెళితే.ఫిరోజ్‌పూర్‌కు చెందిన సుమన్ (పేరు మార్చబడింది) కొన్ని రోజుల క్రితం యూఏఈలోని ఆజ్మాన్‌లో నిర్బంధానికి గురైంది.కేరళకు చెందిన దుబాయ్‌లో స్థిరపడిన షాటర్‌ను నమ్మి ఆమె గల్ఫ్‌లో అడుగుపెట్టింది.అయితే చట్టపరమైన వివరాలు సరిగా ఇవ్వకపోవడంతో సుమన్ అక్కడే చిక్కుకుపోయింది.
షాటర్ డ్రైవర్ ఆమెను ఎయిర్‌పోర్ట్ నుంచి కారులో ఓ వసతి గృహానికి తీసుకెళ్లాడు.అక్కడ అప్పటికే ఐదుగురు అమ్మాయిలు వున్నారు.20 రోజులు గడుస్తున్నా తమకు షాటర్ ఎలాంటి ఉద్యోగాన్ని కల్పించలేదని సుమన్ తెలిపింది.టూరిస్ట్ వీసాపై యూఏఈలో అడుగుపెట్టిన మాకు ఉద్యోగాలు ఇప్పిస్తామని, వర్క్ వీసా లభిస్తుందని మాయమాటలు చెప్పారని సుమన్ పేర్కొంది.
ఈలోగా తన టూరిస్ట్ వీసా గడువు ముగియడంతో షాటర్ తన నిజస్వరూపం చూపించాడని వాపోయింది.తనకు డబ్బు ఇవ్వకుంటే జైలుకు పంపిస్తానని బ్లాక్‌మెయిల్ చేశాడని తెలిపింది.ఈ క్రమంలో తనకు మొబైల్ దొరకడంతో వెంటనే పంజాబ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సుమన్ పేర్కొంది.జలంధర్ ఎస్ఎస్పీ ముఖ్విందర్ సింగ్ జోక్యం చేసుకుని తమకు సాయం చేశారని ఆమె తెలిపింది.
పంజాబ్ పోలీసుల చొరవతో, భారత్‌కు చెందిన కొందరు వ్యక్తులు మమ్మల్ని విడిపించి.పంజాబీలు ఏర్పాటు చేసిన క్లబ్‌లో వుంచారని సుమన్ తెలిపింది.స్థానిక పోలీసులను కూడా ఆశ్రయించామని, త్వరలోనే మా పాస్‌పోర్ట్‌లు కూడా ఇస్తామని వారు హామీ ఇచ్చారని చెప్పింది.