భారీ స్థాయిలో ధర పలికిన పుంగనూరు ఆవు.. ఎంతో తెలిస్తే షాకే!

సాధారణంగా ఆవులు నాలుగైదు అడుగుల కంటే ఎక్కువ ఎత్తు ఉంటాయి.కానీ పుంగనూరు ఆవులు మాత్రం రెండున్నర అడుగుల ఎత్తును మించవు.

 Punganur Cow, Which Fetched A Huge Price Punganaru Cow, Costly, Viral Latest, N-TeluguStop.com

అంటే ఎంత తక్కువ హైట్ ఉంటాయో అర్థం చేసుకోవచ్చు.ప్రపంచంలో అత్యంత పొట్టి అయిన ఆవులు కూడా ఇవే.పెద్ద వాటికి స్మాల్ వెర్షన్ ఆవు లాగా కనిపించే ఇవి చూడటానికి భలే ముచ్చటగా అనిపిస్తాయి.సాధారణ ఆవులతో పోల్చుకుంటే వీటిలో పాల దిగుబడి చాలా తక్కువ అని కూడా చెప్పొచ్చు.

కాకపోతే మేత ఎక్కువగా వేయాల్సిన అవసరం రాదు.అందువల్ల రైతుకి ఎక్కువగా ఖర్చు ఉండవు.

పుంగనూరు జాతి ఆవు డైలీ 2-3 లీటర్ల పాలు అందిస్తుంది.ఈ పాలలో ఏకంగా 8 శాతం వెన్న ఉండటం విశేషం.

పుంగనూరు ప్రాంతంలో అధికంగా కన్పించే ఈ జాతి ఆవులు ఉన్న కొద్దీ అంతరించిపోతున్నాయి.రైతులు ఈ జాతి ఆవుల సంఖ్యను పెంచేందుకు చాలా చర్యలు చేపడుతున్నారు.

ఈ ఆవులకు మరో స్పెషాలిటీ ఉంది.అదేంటంటే, వీటిని ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచిది.

అలానే సంపద కూడా కలుగుతుందట.అందుకే ఈ అరుదైన ఆవులను ఎక్కువ డబ్బులు ఇచ్చి మరీ కొనుగోలు చేస్తున్నారు.

ఇక ఆవు ధర విషయానికి వస్తే.గుంటూరు జిల్లాలోని తెనాలిలో నివసిస్తున్న కంచర్ల శివకుమార్‌ పుంగనూరు ఆవులు పెంచుతున్నారు.

ఇటీవల ఆయన వద్దకు హరిద్వార్‌లోని బాబా రాందేవ్‌ ఆశ్రమం నుంచి ప్రతినిధులు వచ్చారు.అనంతరం అక్కడ చూసిన ఒక పుంగనూరు ఆవును రూ.4.10లక్షల పెట్టి కొనుగోలు చేశారు.ఇంత ధర పెట్టి ఈ ఆవును కొనుగోలు చేయడంతో అందరూ అవాక్కవుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube