పునీత్ రాజ్ కుమార్ కుటుంబ సభ్యుల మంచి మనస్సు.. హెల్త్ స్కీమ్ తో ఆ ప్రాణాలను కాపాడుతూ?

శాండిల్ వుడ్ స్టార్ హీరోలలో ఒకరైన పునీత్ రాజ్ కుమార్( Puneeth Raj Kumar ) తన నటన, సేవా కార్యక్రమాల ద్వారా కర్ణాటక ప్రజల హృదయాలను గెలుచుకున్నారు.అయితే చిన్న వయస్సులోనే ఆయన మరణం అభిమానులను ఎంతగానో బాధ పెట్టింది.

 Puneeth Raj Kumar Family Members Great Heart Details, Puneeth Raj Kumar, Social-TeluguStop.com

పునీత్ మరణం తర్వాత కూడా ఆయన సేవా కార్యక్రమాలు కొనసాగేలా కుటుంబ సభ్యులు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో మృతి చెందిన సంగతి తెలిసిందే.

పునీత్ లా మరెవరూ చనిపోకూడదని పునీత్ కుటుంబ సభ్యులు కర్ణాటక సర్కార్ తో కలిసి ఒక హెల్త్ స్కీమ్ ను( Health Scheme ) అమలు చేస్తున్నారు.కర్ణాటక రాష్ట్ర ఆరోగ్య శాఖా మంత్రి దినేష్ గుండు రావు మాట్లాడుతూ ఈ విషయాలను వెల్లడించారు.

అప్పు యోజన( Appu Yojana ) పేరుతో ఈ స్కీమ్ అమలవుతోంది.బస్టాండ్స్, రైల్వేస్టేషన్లు, విమానశ్రయాలు, మాల్స్ లో ఆటోమేటెడ్ ఎక్స్‌టర్నల్ డీఫిబ్రిలేటర్లను అందుబాటులో ఉంచి ఎవరైనా గుండెపోటుకు గురైతే ఈ పరికరం సాయంతో ప్రథమ చికిత్స అందించనున్నారు.

Telugu Appu, Appu Yojana, Heart, Jayadev, Sandalwood-Movie

వీటి ఏర్పాటు కోసం అతి త్వరలో టెండర్ల ప్రక్రియ మొదలుకానుంది.జయదేవ హాస్పిటల్ లో( Jayadev Hospital ) ఈ ప్రాజెక్ట్ మొదటి దశను మొదలుపెట్టనున్నారని తెలుస్తోంది.పునీత్ పేరుతో అమలవుతున్న ఈ స్కీమ్ వల్ల ప్రజలకు ఎంతగానో ప్రయోజనం చేకూరనుంది.ఈ స్కీమ్ వల్ల గుండెపోటు( Heart Attack ) వచ్చిన వాళ్లకు వేగంగా చికిత్స అందే అవకాశం అయితే ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Telugu Appu, Appu Yojana, Heart, Jayadev, Sandalwood-Movie

పునీత్ రాజ్ కుమార్ తను చేసిన సేవా కార్యక్రమాల ద్వారా ప్రజల హృదయాల్లో చోటు సంపాదించుకున్నారు.పునీత్ రాజ్ కుమార్ భౌతికంగా మరణించినా తమ హృదయాల్లో మాత్రం జీవించి ఉన్నారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.పునీత్ రాజ్ కుమార్ మరణించినా ఆయన గొప్పదనం తెలుసుకుని చాలామంది ఆయనకు అభిమానులుగా మారుతున్నారు.పునీత్ పేరుతో రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాల దిశగా అడుగులు పడుతున్నాయని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube