అనంతపురం జిల్లా హిందూపురంలో కూరగాయల వ్యాపారులు నిరసన కార్యక్రమం చేపట్టారు.రోడ్డుపై కూరగాయలు పారబోసి ఆందోళన నిర్వహించారు.
ప్రభుత్వం స్పందించి తమకు మార్కెట్ స్థలం కేటాయించాలని వ్యాపారులు డిమాండ్ చేశారు.లేని పక్షంలో హిందూపురంకు కూరగాయల విక్రయం ఆపేస్తామని హెచ్చరించారు.
దీంతో మార్కెట్ వద్ద ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.