హనుమాన్ మూవీ( Hanuman Movie ) ఇప్పటికే 200 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.హనుమాన్ మూవీ నిన్న కూడా భారీ స్థాయిలో కలెక్షన్లను సాధించింది.
ఈరోజు కూడా కొన్ని థియేటర్లలో ఈ సినిమా అదిరిపోయే బుకింగ్స్ తో ప్రదర్శితమవుతోంది.ఈ సినిమా దర్శకుడు ప్రశాంత్ వర్మ( Director Prasanth Varma ) హనుమాన్ మూవీ గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
హనుమంతుడి విగ్రహాన్ని తెరపై చూసిన సమయంలో అభిమానులు పిచ్చెక్కిపోతున్నారని ప్రశాంత్ వర్మ అన్నారు.
పవన్ లాంటి మాస్ హీరో సినిమా విడుదలైతే ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో తెరపై హనుమంతుడిని( Hanuman ) చూసిన సమయంలో సైతం అలాగే పండుగ చేసుకుంటున్నారని ప్రశాంత్ వర్మ పేర్కొన్నారు.
ఫుల్ రన్ లో ఈ సినిమా 300 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సైతం సొంతం చేసుకునే అవకాశాలు అయితే ఉన్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.హనుమాన్ సీక్వెల్ మరింత ఎక్కువ బడ్జెట్ తో తెరకెక్కుతోంది.

జై హనుమాన్( Jai Hanuman ) సినిమాలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని సమాచారం అందుతోంది.హనుమాన్ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించగా తేజ సజ్జా, ప్రశాంత్ వర్మ ఈ సినిమాతో బాక్సాఫీస్ ను షేక్ చేశారు.జై హనుమాన్ మూవీలో తేజ సజ్జా( Teja Sajja ) పాత్రకు పెద్దగా ప్రాధాన్యత ఉండదని సమాచారం అందుతోంది.హనుమాన్ మూవీలో నటించిన ప్రతి ఒక్కరికీ మంచి పేరు వచ్చింది.

హనుమాన్ మూవీ సీక్వెల్ లో తేజ సజ్జా కేవలం కొన్ని సీన్లకే పరిమితం కానున్నారని భోగట్టా.జై హనుమాన్ మూవీలో చిరంజీవి( Chiranjeevi ) నటించే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తుండగా ఆ వార్తల్లో నిజానిజాలు తెలియాల్సి ఉంది.జై హనుమాన్ మూవీ చిన్న సినిమా కాదని మేకర్స్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశారు.ప్రశాంత్ వర్మ పారితోషికం సైతం భారీ రేంజ్ లో పెరిగిందని సమాచారం అందుతోంది.