తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఆర్టిస్టులు అందరూ కలిసి మా( MAA ) అనే ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది… మా అంటే మూవీ ఆర్టిస్ట్ అసోయేషన్… ఇక సినిమాల్లో నటించే ప్రతి ఒక్క నటుడు ఇందులో సభ్యత్వం కలిగి ఉండాలి.అలా ఉంటేనే వాళ్ళకి సినిమాల్లో అవకాశాలు ఇవ్వాలి అనే విధంగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అనే ఒక సంఘాన్ని నిర్మించుకొని ఆర్టిస్టులు అందరూ కలిసి దాంట్లో భాగస్వాములు అవుతూ ఉంటారు.
ఈ సంఘానికి ఒక అధ్యక్షున్ని నియమిస్తూ ఉంటారు ఆయన పదవీ కాలం రెండు సంవత్సరాలు ఉంటుంది…
అందులో భాగంగానే 2021వ సంవత్సరంలో జరిగిన మా ఎలక్షన్స్ లో ప్రకాష్ రాజు( Prakash Raj ) అధ్యక్షుడిగా పోటీ చేశాడు ఇక మరో అధ్యక్షుడిగా మంచు విష్ణు( Manchu Vishnu ) పోటీ చేశాడు.ఇక ఈ ఎలక్షన్స్ టైం లో ప్రకాష్ రాజ్ మంచు విష్ణు మధ్య చాలా విపరీతమైన గొడవలు జరిగాయి.
ప్రతిక్షణం ఎవరో ఒకరు కామెంట్ చేస్తూ ఉండడం దానికి కౌంటర్ గా మరొకరు మరో కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది ఇక ఆ ఎలక్షన్స్ లో గెలవడానికి ప్రతి ఒక్కరూ ఒక్కో హామీ ఇవ్వడం జరిగింది.
ఇక మంచు విష్ణు అయితే మా అసోసియేషన్ కి( MAA Association ) కావాల్సిన బిల్డింగ్ ని నా సొంత డబ్బులతో కట్టిస్తాను అని చెప్పడం జరిగింది.సీనియర్ ఆర్టిస్టులు అందరికీ అందరికి స్టై ఫండ్ కూడా ఇప్పిస్తాను.పేద కళాకారులకి( Poor Artists ) అవకాశాలు ఇప్పిస్తాను అంటూ ప్రగల్బాలు పలికాడు.
ఇక తీరా ఇప్పుడు చూస్తే మాత్రం గెలిచి రెండు సంవత్సరాలు అయిన కూడా ఇంతవరకు ఏ ఒక్క పని కూడా సక్రమంగా చేయలేదు.
ఇక మా (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్)బిల్డింగ్ ని సొంత డబ్బులతో కట్టిస్తాను అని చెప్పి కనీసం బిల్డింగ్ కు శంకుస్థాపన కూడా చేయలేదు.దీంతో సినీ ప్రముఖులు సైతం మంచు విష్ణు పైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ప్రకాష్ రాజు కూడా మంచు విష్ణు గెలిచి రెండు సంవత్సరాలు అయిన కూడా ఇంకేం చేయలేదు అంటూ వ్యంగంగా మాట్లాడుతున్నాడు…