యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా కేజీఎఫ్ స్టార్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో రూపొందిన సలార్ సినిమా ను క్రిస్మస్ కానుకగా ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్న విషయం తెల్సిందే.భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ సినిమా వెయ్యి కోట్ల వసూళ్ల టార్గెట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెల్సిందే.
తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేయడం జరిగింది.సినిమా ట్రైలర్ కి ఏకంగా 150 మిలియన్ ల డిజిటల్ వ్యూస్ వచ్చిన విషయం తెల్సిందే.
ఈ నేపథ్యం లో సలార్ సినిమా ప్రమోషన్ ఎప్పుడు షురూ చేస్తారు.ప్రభాస్ మీడియా ముందుకు ఎప్పుడు వస్తాడా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఆదిపురుష్ విడుదల తర్వాత విదేశాలకు వెళ్లిన ప్రభాస్ తిరిగి వచ్చిన తర్వాత ఇప్పటికే మారుతి దర్శకత్వం లో రూపొందుతున్న సినిమా షూటింగ్ లో పాల్గొన్నాడు.అంతే కాకుండా ఇంకా ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు.
కానీ ఇప్పటి వరకు సలార్ కి సంబంధించిన ప్రమోషన్ లో మాత్రం పాల్గొనడం లేదు.ఈ విషయమై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.సలార్ విడుదల కు ఇంకా రెండు వారాల సమయం కూడా లేదు.ఇంకా ఎప్పుడు మీడియా పబ్లిసిటీ మొదలు పెడుతారు అంటూ చాలా మంది దర్శకుడు ప్రశాంత్ నీల్ ని ప్రశ్నిస్తున్నారు.
ఈ నేపథ్యం లో హంబులే నిర్మాణ సంస్థ వారు అతి త్వరలోనే సినిమా కు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు షురూ అవ్వబోతున్నట్లుగా ప్రకటించాడు.అన్ని అనుకున్నట్లుగా జరిగితే సలార్ కి సంబంధించిన ప్రమోషన్ లో ప్రభాస్ డిసెంబర్ 15 నుంచి పాల్గొనే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు.
అంటే వారం రోజుల ముందు నుంచి సలార్ ప్రమోషన్స్ లో ప్రభాస్ పాల్గొంటాడు.మరి ఈ వారం రోజులు సరిపోయేనా చూడాలి.