యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ( Prabhas )హీరోగా రూపొందిన సలార్ సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది.ఇప్పటికే రూ.500 కోట్ల వసూళ్లను సినిమా రాబట్టింది.అయితే సినిమా కు అన్ని చోట్ల కూడా భారీ ఎత్తున ప్రీ రిలీజ్ బిజినెస్ జరగడంతో ఇప్పటి వరకు ఏ ఒక్క చోట కూడా బ్రేక్ ఈవెన్ అవ్వలేదు అంటున్నారు.
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం కేవలం 75 శాతం వసూళ్లు మాత్రమే ఇప్పటి వరకు వచ్చాయి.మిగిలిన 25 శాతం వసూళ్లు వచ్చేనా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఈ వీకెండ్ లో ముఖ్యంగా కొత్త సంవత్సరం సందర్భంగా థియేటర్లు జనాలతో నిండితే సలార్ ( Salaar movie )కు మళ్లీ భారీ ఎత్తున వసూళ్లు నమోదు అయ్యే అవకాశం ఉంది.అదే జరిగితే సలార్ కి మంచి వసూళ్లు నమోదు అవ్వడం… ఆ బ్యాలన్స్ 25 శాతం వసూళ్లు కూడా పూర్తి అవ్వడం జరుగుతుంది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.అయితే కేజీఎఫ్ 2 మాదిరిగా వెయ్యి కోట్ల వసూళ్లు మాత్రం సాధ్యం అయ్యే పరిస్థితి కనిపించడం లేదు.లాంగ్ రన్ లో సినిమా రూ.800 కోట్ల వరకు వచ్చి ఆగుతుందేమో అంటున్నారు.
యానిమల్ సినిమా కంటే కూడా సలార్ సినిమా వసూళ్లు తక్కువ నమోదు అయ్యే పరిస్థితులు ఉన్నాయి అంటున్నారు.సలార్ కు పోటీగా డంకీ సినిమా( Dunki Movie ) వచ్చింది.అంతే కాకుండా కన్నడ నాట సలార్ సినిమా ను ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోవడం లేదు.
అక్కడ నుంచి వస్తాయి అనుకున్న వసూళ్లలో కేవలం 50 శాతం మాత్రమే వస్తున్నాయి.అంతే కాకుండా హిందీ వర్షన్ సలార్ కి ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు.
దాంతో ఓవరాల్ గా వెయ్యి కోట్ల వసూళ్ల టార్గెట్ ను సలార్ రీచ్ అవ్వలేక పోయాడు అనేది బాక్సాఫీస్ వర్గాల మాట.