యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్( Prabhas ) హీరోగా రూపొందిన సలార్ సినిమా( Salaar ) వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.ఈ సినిమా ను క్రిస్మస్ కానుకగా విడుదల చేయబోతున్నారు.
కేజీఎఫ్ ఫిల్మ్ మేకర్ ప్రశాంత్ నీల్ ( Prashanth Neel ) దర్శకత్వంలో రూపొందిన సలార్ సినిమా ను దేశ వ్యాప్తంగా భారీ ఎత్తున రేట్లు పెట్టి కొనుగోలు చేయడం జరిగిందట.నైజాం ఏరియాలోనే ఈ సినిమా దాదాపుగా రూ.70 కోట్ల కు అమ్ముడు పోయిందని అంటున్నారు.ఆ రేంజ్ లో ఈ సినిమా అమ్ముడు పోయింది అంటే మినింగా వంద కోట్ల వసూళ్లు నైజాం ఏరియా లో రాబట్టాల్సి ఉంటుంది.

మరీ ఈ సినిమాకు అంత సీన్ మరియు సత్తా ఉందా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.నైజాం ఏరియాలో( Nizam Area ) కేవలం రెండు వారాల్లోనే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించి ఇండియాస్ బెస్ట్ మూవీగా నిలుస్తుందని, బాహుబలి మరియు ఇతర భారీ చిత్రాల రికార్డులను బ్రేక్ చేస్తుంది అంటూ అంతా కూడా చాలా నమ్మకంతో ఉన్నారు.ప్రస్తుతం సినిమాకు సంబంధించి ట్రైలర్ రిలీజ్ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.

ఎప్పుడు సలార్ ట్రైలర్( Salaar Trailer ) వచ్చినా కూడా యూట్యూబ్ రికార్డులు అన్నీ కూడా బద్దలు అవ్వడం ఖాయం అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు చాలా నమ్మకంతో ఉన్నారు.అన్ని అనుకున్నట్లుగా జరిగితే సినిమా ఏకంగా వెయ్యి కోట్ల వసూళ్లు నమోదు చేయడంతో పాటు 500 కోట్ల నాన్ థియేట్రికల్ బిజినెస్ చేస్తుంది అంటున్నారు.అంటే నిర్మాతకు పెట్టుబడి పోను వెయ్యి కోట్లకు పైగా లాభం అంటున్నారు.మార్కెట్ లో నెం.1 గా చెలామని అవుతున్న సలార్ సినిమా టికెట్ల రేట్లు ( Salaar Ticket Rates ) కూడా ఆకాశమే హద్దు అన్నట్లుగా ఉంటాయేమో అని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.సలార్ సినిమా లో హీరోయిన్ గా శృతిహాసన్ నటించిన విషయం తెల్సిందే.