పాకిస్తాన్ లో కరెంటు కష్టాలు.. రాత్రి 8:30 కి అంతా బంద్..!!

ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభంతో పాటు విద్యుత్ సంక్షోభం కూడా నెలకొన్న సంగతి తెలిసిందే.భారత్ లో కూడా వేసవిలో కరెంటు కష్టాలు తప్పవని కేంద్ర పెద్దలు అంటున్నారు.

 Power Problems In Pakistan Everything Shut Down Before 8 Clock Pakistan Governam-TeluguStop.com

ఈ దిశగా ఇప్పటికే ప్రపంచంలో మన దేశాలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.విద్యుత్ సంక్షేపం విషయంలో అయితే పాకిస్తాన్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది.

ఇప్పటికే ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతున్న పాకిస్తాన్ ఇంధన పొదుపు చర్యలు ప్రకటించింది.పాక్ మంత్రి ఖావాజా… రాత్రి 8:30 గంటలకు మార్కెట్ లు, రాత్రి 10 గంటలకు ఫంక్షన్ హాల్స్ మూసేయాలని ప్రకటించారు.

అంతేకాదు ఫిబ్రవరి నుంచి బల్బులు తయారీ నాసిరకం ఫ్యాన్ ల ఉత్పత్తి కూడా ఆపేస్తామని పేర్కొన్నారు.ప్రభుత్వ కార్యాలయాల్లో 30% విద్యుత్ ఆదాకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.

ఇంధన పొదుపు ప్రణాళికలకి సంబంధించి జారీ చేసిన ఆదేశాలు తక్షణమే అమలు చేయాలని పేర్కొన్నారు. పాకిస్తాన్ కి చాలామంది ప్రధానులు మారుతున్న గాని ప్రధాన సమస్యలు మాత్రం ప్రజలను పట్టిపీడిస్తున్నాయి.

ఎన్నికైన ప్రధానులు ఎక్కువగా యుద్ధాలపై దృష్టి పెట్టడంతో…ఇప్పుడు దేశ సమస్యలను తీర్చడానికి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ప్రజెంట్ మాత్రం పాకిస్తాన్ నీ విద్యుత్ సంక్షోభం తీవ్రస్థాయిలో వేధిస్తూ ఉంది.

దీని అధిగమించడానికి పాలకులు తీసుకుంటున్న నిర్ణయాలు పాక్ ప్రజలకు అసహనాన్ని కలిగిస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube