మొన్న వైజాగ్ లో జరిగిన సభలో పవన్ విశ్వరూపం చూపించాడు.ఆ వేడి చల్లారక ముందే మరోసారి మరోసారి తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు.
వైకాపాపై విరుచుకుపడ్డాడు.తనలో ఆవేశాన్ని మరోసారి ప్రదర్శించాడు జనసేనాని పవన్ కళ్యాణ్.
ఆయన ఆవేశానికి కారణం ఏంటి? ఎందుకు అంత ఆగ్రహానికి గురైనారు? కారణాలు ఏంటి తెలుసుకుందాం.మార్చ్ 2023 లో జనసేన ని ఆవిర్భావ సభలు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.
దానికి గుంటూరు జిల్లా ఇప్పటం ని ఎంచుకున్నారు పవన్ కళ్యాణ్.అక్కడ సభ ఏర్పాటుకు కొంత స్థలం సేకరించే ఆలోచనలు పడ్డారు పవన్ కళ్యాణ్.
ఇది గ్రహించిన వైకాపా నేతలు వారి పథకాన్ని అమలుకాకముందే చేదించారు.రహదారుల విస్తరణ పేరుతో కొందరు ఇళ్లని కూల్చి వేశారు .ఈ విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ హుటహుటీన సంఘటన స్థలానికి చేరుకున్నారు.ఇల్లు దెబ్బ తిన్న బాధితులని పరామర్శించారు.
వైకాపాది గుండా రాజ్యమని కూల్చివేద్దామని పిలుపునిచ్చారు.అక్కడ జగన్ రెడ్డి ముఖ్యమంత్రి లేక సజ్జల రామకృష్ణారెడ్డి ముఖ్యమంత్రా అని విరుచుకుపడ్డారు.
ఇప్పటంలో ఇంటింటికి వెళ్లి బాధితులని పరామర్శించారు పవన్ కళ్యాణ్.
ఈ పర్యటన అధ్యంతం ఎంతో ఉత్కంఠగా సాగింది.
పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు.కానీ పవన్ కళ్యాణ్ కొంతవరకు సహనం వహించారు.
ఆపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.ప్రభుత్వంపై పోలీసుల తీరుపై విరుచుకుపడ్డారు.
ఇదే తీరు కొనసాగితే పైకాపాన్ని కూడా త్వరలో కూల్చివేస్తామని హెచ్చరించారు.పవన్ కళ్యాణ్ మరోసారి వైజాగ్ లో మాదిరిగా నిప్పులు జరిగారు.
వైకాపా పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.దాదాపు కొంతదూరం కాలి నడక నడిచి ఆపై పోలీసుల అనుమతి నిరాకరణతో వాహనంపై కూర్చుని పర్యటించారు.
శిధిలాల మట్టిని చేతిలోకి తీసుకొని ఈ ఇంటి మట్టి సాక్షిగా మీ యొక్క కూల్చివేత తధ్యం.అని పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇది దౌర్జన్యం దురహంకారంమనీ వైకాపా ప్రభుత్వం చేస్తున్న హింసరచననీ ఆయన చెలరేగిపోయారు.జనసేన కార్యకర్తలకి ఏం జరిగినా దానికి బాధ్యత ప్రభుత్వానిదే అని ఆయన హెచ్చరించారు.
విస్తరించడానికి ఏమైనా ఇప్పటం మహానగరమా రాజమండ్రి కాకినాడా? అని ఆయన నిలదీశారు.

పవన్ కళ్యాణ్ మరోసారి ఉగ్ర రూపం చూపించాడు.తన ఆవేశాన్ని తనదైన పద్దతిలో ప్రదర్శించాడు పవన్.ఐతే ఈ సారీ వైకాపా నేతలు వెంటనే ప్రతిస్పందించారు.
పవన్ని అదే స్థాయిలో విమర్శించారు.ఇదంతా పవన్ కళ్యాణ్ చేస్తున్న డ్రామాగా వైకపా నేతలు అభివర్ణించారు.
ఎక్కడి నుంచో వచ్చి రెండు గంటలు డ్రామా ఆడి సినిమా షూటింగ్ లాగా హడావుడి చేసి వెళ్లిపోయాడని పవన్నీ విమర్శించారు.ఇది కేవలం నటనని ఈ నటనకి తాము ఏం భయపడేది లేదని వైకాపా నాయకులు అంతేగాటుగా ప్రతిస్పందించారు.
ఎప్పుడు సామాన్యంగా సామ్యంగా శాంతంగా సహనంగా హుందాగా ఉండే పవన్ కళ్యాణ్ గత కొంతకాలంలో ఎందుకు ఆసహనానికి గురవుతున్నారు.ఈమధ్య ఆయనలో ఎందుకు ఉగ్రరూపం వ్యక్తం అవుతుంది.
శాంత పవనం ఎందుకు ఉగ్ర ప వనంగా మారుతుంది? ఇకపై పవన్ ఇలాగే కొనసాగుతారా? ఇలాగే అగ్రహవేశంతో ఊగిపోతారా? ఇలాగే వైకాపా పై నిప్పులు చేరుగుతారా ? తన సహజ శాంత రూపాన్ని ప్రశాంత మనస్తత్వాన్ని వదిలేస్తారా? అనేది ఆలోచించాల్సిన విషయం.