ఏపీ స్కిల్ డెవలప్ స్కామ్ లో భాగంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ( Chandra Babu )అరెస్టు కావడంతో ఎంతోమంది నిరసనలు వ్యక్తం చేస్తూ ధర్నాలు చేశారు.అయితే చంద్రబాబు నాయుడు అరెస్టు కావడంతో ఏపీ బీజేపీ అధ్యక్షరాలు పురందేశ్వరి ( Purandeswari )ముందుగా రియాక్ట్ అవుతూ ఈ అరెస్టును ఖండించారు అంతేకాకుండా ఈ మధ్యకాలంలో ఈమె మీడియా సమావేశాలలో ఎక్కువగా పాల్గొంటూ ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి( Jagan Mohan Reddy ) పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు.
ఇక ఈమె మీడియా సమావేశాలలో మాట్లాడటం చూస్తుంటే చంద్రబాబు నాయుడు జైల్లో ఉంటే ఆయన లేని లోటును టిడిపి పార్టీకి తీరుస్తున్నారని స్పష్టంగా అర్థం అవుతుంది.
పురందేశ్వరి మాట్లాడుతూ బీజేపీ గురించి కాకుండా టిడిపి భజన చేస్తూ జగన్మోహన్ రెడ్డి పై విమర్శలు చేస్తున్నారు.దీంతో పురందేశ్వరి వ్యాఖ్యలపై నటుడు పోసాని కృష్ణమురళి ( Posani Krishna Murali ) స్పందిస్తూ తనకు కౌంటర్ ఇచ్చారు.ఈ సందర్భంగా పోసాని కృష్ణమురళి మాట్లాడుతూ.
పురందేశ్వరి ఎప్పుడైతే బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలుగా ఎంపికయ్యారు.అప్పటినుంచి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడమే పనిగా పెట్టుకున్నారని తెలిపారు.
ఇక చంద్రబాబు నాయుడు తన బంధువు కావడంతో ఆయన ఎంత దుర్మార్గుడైన కానీ అతనిపై కక్ష సాధింపుగానే తనని అరెస్టు చేసినట్లు ఈమె మాట్లాడుతున్నారని పోసాని తెలిపారు.
చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పదవి కోసం ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచారు.ఇక పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు నాయుడు ఒక ఏటీఎంలా వాడుకున్నారని సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ వ్యాఖ్యలను చేశారు.ఒకానొక సమయంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మద్యపానం నిషేధం చేస్తే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యి మద్యపాన నిషేధాన్ని తీసేశారు.
అప్పుడు పురందేశ్వరి ఎందుకు మాట్లాడలేదని పోసాని ప్రశ్నించారు.బాలకృష్ణ( Balakrishna ) ఏదో పిట్టలని కాల్చినట్లు ఇద్దరు వ్యక్తులపై కాల్పులు జరిపితే ఆయనని అరెస్టు చేయకుండా పురందేశ్వరి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైయస్సార్ ( YSR ) గారిని వేడుకోవడంతోనే ఆయన జైలుకు వెళ్లకుండా ఉన్నారని పోసాని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
ఇక ఈ విషయాలన్నీ మీకు తెలియదా ఎన్టీఆర్ వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీలో మీరు ఎలా చేరారు? ఇప్పుడు బిజెపి ఓడిపోతే తిరిగి కాంగ్రెస్ లోకి వెళ్తారా అంటూ ఈయన పురందేశ్వరి పై ప్రశ్నల వర్షం కురిపిస్తూ ఘాటుగానే రియాక్ట్ అయ్యారు.