Money : రోడ్డుపై కుప్పలుతెప్పలుగా డబ్బులు.. సూట్‌కేసులలో నింపుకుంటున్న ప్రజలు..

ఎప్పుడైనా రోడ్డుపై రూ.100 నోటు దొరికితే చాలా సంతోషం అనిపిస్తుంది.అందులోనూ డబ్బులు కట్టలు పడితే ఇక పంట పండినట్లే.కొందరు మాత్రం అధికారులకు సమాచారం ఇచ్చి తమ నిజాయితీ చాటుకుంటారు.ఆయాచితంగా వచ్చిన డబ్బును అస్సలు ముట్టుకోరు.కానీ ప్రస్తుత సమాజంలో అలాంటి వారు చాలా అరుదుగా కనిపిస్తారు.

 Piles Of Money On The Road People Are Filling Suitcases-TeluguStop.com

రోడ్డుపై ఎక్కడైనా నోట్లు పడి ఉన్న ఇలాంటి దృశ్యాన్ని ఎప్పుడైనా చూశారా? కొన్ని సందర్భాల్లో కొందరు వ్యక్తులు సోషల్ మీడియా( Social media )లో వైరల్ అయ్యేందుకు కరెన్సీ నోట్లను విసిరి వేయడం చూశాం.

కార్లలో వెళ్తూ, వంతెన పై నుంచి కిందికి డబ్బులు కొందరు విసిరేసిన వీడియోలు గతంలో బాగా వైరల్ అయ్యాయి.దీంతో ఆ సమయంలో దొరికిన డబ్బును ఏరుకునేందుకు చాలా మంది పోటీ పడ్డారు.కొన్ని సందర్భాల్లో రోడ్డుపై డబ్బులు ఏరుకుంటున్న ప్రజల వల్ల ట్రాఫిక్ పెద్ద ఎత్తున ఆగిపోయింది.

అయితే నోట్లే కాకుండా నోట్ల కట్టలతో నిండిపోయిన రోడ్డును బహుశా మీరు ఎప్పుడూ చూసి ఉండరు.అలాంటి ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

ఈ ఆసక్తికర వీడియో గురించి తెలుసుకుందాం.రోడ్డుపై ఏదైనా మద్యం లోడుతో వెళ్తున్న లారీలు, లేదా చేపల లోడుతో వెళ్తున్న లారీలో బోల్తా పడిన ఘటనల్లో కొన్ని ఆసక్తికర ఘటనలు జరుగుతుంటాయి.

క్షణాల్లోనే ఆ లారీ సరుకును స్థానికులు, అటుగా వెళ్తున్న వాహనదారులు ఖాళీ చేస్తుంటారు.అలాంటిది రోడ్డుపై డబ్బులు కుప్పలు కుప్పలుగా పడి ఉంటే వదులుతారా? అస్సలు వదలరు.అలాంటి ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట హల్ చల్ చేస్తోంది.

నేటి కాలంలో రోడ్డుపై డబ్బులు( Money ) చెల్లాచెదురుగా పడి ఉన్నాయని, సూట్‌కేసుల్లో( Suitcases ) తీసుకెళ్తున్నారని ఎవరైనా చెబితే నమ్మడం కష్టం.ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో రోడ్డుపై చాలా నోట్లు ఎలా చెల్లాచెదురుగా ఉన్నాయో చూడవచ్చు.ఇద్దరు వ్యక్తులు ఆ నోట్లను సూట్‌కేస్‌లో నింపడంలో బిజీగా ఉన్నారు.

ఇంత డబ్బు వస్తే లైఫ్ సెటిల్ అయినట్లే అని ఈ వీడియో చూసిన తర్వాత అందరి మనసులో మెదులుతుంది.దీన్ని బట్టి చూస్తే ఈ నోట్లు మధ్యప్రాచ్యంలోని ఏదో ఒక దేశానికి చెందినవని తెలుస్తోంది.

ఆ డబ్బులు అక్కడి కరెన్సీ అని తెలుస్తోంది.ఈ వీడియోను మిస్టర్ గుడ్ లక్ అనే యూజర్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు.

ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.దీనికి నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.

ఆ డబ్బు తనకు దొరికితే తన లైఫ్ సెటిల్ అయిపోతుందని ఓ యూజర్ కామెంట్ చేశాడు.ఇంతకీ అవి నిజమైనవా లేక నకిలీవా అని కొందరు నెటిజన్లు సందేహం వెలిబుచ్చారు.

ఇక కొన్ని దేశాల్లో కరెన్సీకి అసలు విలువ ఉండదని, అలాంటి డబ్బు ఎంత ఉన్నా రొట్టె ముక్క కొనుక్కోవడానికి సరిపోతుందని మరికొందరు పేర్కొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube