ఒకదేశం 6 నెలలు పాలిస్తే, మరోదేశం 6 నెలలు పాలించడమా? ఇదెక్కడి విడ్డురం అని కొట్టే పారేయొద్దు.మీరు విన్నది నిజమే.
సాధారణంగా మనకు ఎన్నికలు ఐదేళ్లకోసారి మాత్రమే వస్తాయి.అప్పుడే ఒక పార్టీ నుండి మరో పార్టీకి అధికార మార్పిడి అనేది సాధారణంగా జరుగుతుంది.
లేదంటే సేమ్ పార్టీ అధికారంలోకి వస్తే మరో ఐదేళ్లు పాలన కొనసాగిస్తుంది.కానీ, ఓ ద్వీపాన్ని 6 నెలలు ఒక దేశం పరిపాలిస్తే, ఇంకో 6 నెలలు మరో దేశం పరిపాలిస్తుంది.
ఆ ద్వీపం పేరే పీజంట్.( Pheasant Island ) దీనిని ఫాసెన్స్ ద్వీపం అని కూడా అంటారు.ఇది ప్రపంచంలోనే అత్యంత వింతైన ద్వీపం.ఇది ఏకకాలంలో 2 దేశాల ఆధీనంలో ఉంటుంది.
ఈ ద్వీపం ఫ్రాన్స్,( France ) స్పెయిన్( Spain ) మధ్య ఉండడమే దానికి కారణం.ఈ ద్వీపానికి సంబంధించి రెండు దేశాల మధ్య ఎటువంటి గొడవలు లేవు.ఘర్షణలకు బదులుగా 6 నెలలు చొప్పున అధికార బదలాయింపునకు అంగీకారం చేసుకున్నాయి.దాంతో ఆ ఇరు దేశాలకు ఎటువంటి ఇబ్బందులు లేవు.ఏ విషయంలోకూడా ఘర్షణలు జరగలేదు.అయితే, ఈ ఒప్పందం ఈనాటికి కాదు.350 సంవత్సరాల క్రితం నాటిదని తెలుస్తోంది.1659 సంవత్సరంలో, ఈ ద్వీపం అధికార మార్పిడికి సంబంధించి ఫ్రాన్స్, స్పెయిన్ రెండింటి మధ్య శాంతి ఒప్పందం జరిగింది.దీనిని పైన్స్ ఒప్పందం అని కూడా పిలుస్తారు.
అయితే అప్పట్లో దీన్ని స్వాధీనం చేసుకునే విషయంలో 2 దేశాల మధ్య చాలా గొడవలే జరిగాయి.చివరకు 6-6 చొప్పున అధికార బదలాయింపునకు అంగీకరించారు.నివేదికల ప్రకారం.200 మీటర్ల పొడవు, 40 మీటర్ల వెడల్పు ఉన్న ఈ ద్వీపం( Island ) ఆగస్టు 1 నుండి జనవరి 31 వరకు ఫ్రెంచ్ పాలనలో ఉంటుంది.ఫిబ్రవరి 1 నుండి జూలై 31 వరకు స్పెయిన్ అధికారం కిందకు వస్తుందన్నమాట.
ఇలాంటి అరుదైన విషయం ఈ ప్రపంచంలో మరొకటి లేదని చెప్పుకోవచ్చు.