అజయ్ భూపతి( Ajay Bhupathi ) దర్శకత్వంలో పాయల్ రాజ్‌పుత్ తాజాగా నటించిన చిత్రం మంగళవారం.( Mangalavaram movie )తాజాగా నవంబర్ 17న ఈ సినిమా విడుదలైన విషయం తెలిసిందే.
భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు.ఈ మూవీని స్వాతి గుణుపాటి, సురేష్ వర్మ సంయుక్తంగా నిర్మించారు.
అంజనీష్ లోక్‌నాథ్ సంగీతాన్ని అందించారు.ఇందులో అజయ్ ఘోష్, నందిత శ్వేత, కృష్ణ చైతన్య, దివ్య పిళ్లై తదితరులు కీలక పాత్రల్లో నటించారు కాగా పాయల్ రాజ్‌పుత్, డైరెక్టర్ అజయ్ భూపతి కాంబినేషన్ లో వచ్చిన రెండవ సినిమా ఇదే.
ఇప్పటికే గతంలో విడుదలైన ఆర్ ఎక్స్ 100 సినిమా( RX 100 ) ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే.ఆ సినిమా తర్వాత మళ్లీ ఈ సినిమాతో మరోసారి వీళ్ళిద్దరి కాంబో రిపీట్ అయింది.మరో సూపర్ హిట్ సినిమాను పాయల్ కి( Payal rajput ) అందించారు దర్శకుడు అజయ్ భూపతి.ఇకపోతే తాజాగా విడుదలైన మంగళవారం సినిమా కలెక్షన్ ల విషయానికి వస్తే.
పల్లెటూరి నేపథ్యంతో భయపెట్టే కథతో రూపొందిన మంగళవారం సినిమాపై మంచి హైప్ క్రియేట్ అయింది.
దీంతో ఈ చిత్రం నైజాంలో రూ.3.20 కోట్లు, ఆంధ్రప్రదేశ్, సీడెడ్ ఏరియాలను కలుపుకుని రూ.7 కోట్లు, రెస్టాఫ్ ఇండియా, కర్నాటక, ఓవర్సీస్ ఏరియాల్లో కలిపి రూ.2 కోట్లు బిజినెస్ చేసింది.ఇలా ప్రపంచ వ్యాప్తంగా దీనికి రూ.12.20 కోట్లు వ్యాపారం జరిగింది.మొత్తానికి భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో పాటు ప్రస్తుతం కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.
కాగా పాయల్ ఈ సినిమాపై మొదటి నుంచి అంచనాలు పెట్టుకుంది.చాలా గ్యాప్ తర్వాత ఈ సినిమాతో ఒక హిట్ సినిమాను తన ఖాతాలో వేసుకుంది పాయల్.సినిమా మంచి విజయం సాధించడంతో ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తోంది పాయల్.