తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోల్లో పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ఒకరు.ఈయన చేసిన సినిమాలు అప్పట్లో సంచలన విజయాలను అందుకున్నాయి.
ఇక ఇప్పుడు ఇటు సినిమా హీరోగా చేస్తూనే అటు జనసేన పార్టీ( Janasena Party ) తరపున కూడా ప్రజలకు తన సేవలను అందిస్తున్నాడు.ఇక ఇలాంటి క్రమంలోనే ఈయన చేసిన ప్రతి సినిమా కూడా మంచి విజయాన్ని అందుకోవడంతో పాటుగా అటు పొలిటిషన్ గా కూడా రాణిస్తున్నాడు…ఇక ఇప్పుడు ఇలా చేస్తున్న సినిమాలు అన్ని షూటింగ్ దశలోనే ఉన్నాయి.
అయితే ఆయన రీసెంట్ గా బ్రో అనే సినిమాతో( Bro Movie ) ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ ఆ సినిమా పెద్దగా ఆశించిన ఫలితానైతే ఇవ్వలేదు.ఎందుకంటే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తన స్థాయి మేరకు సరిపడ స్టోరీ లో నటించలేదు అంటూ చాలా విమర్శలు అయితే వచ్చాయి.
నిజానికి పవన్ కళ్యాణ్ ఇలాంటి నాసిరకం కథలు చేసి తన పేరు చెడగొట్టుకుంటున్నాడని మరికొందరు విమర్శకులు సైతం విమర్శించారు.అయినప్పటికీ పవన్ కళ్యాణ్ తనదైన రీతిలో సినిమాలు చేయడానికి నెక్స్ట్ సిద్ధంగా ఉన్నాడు ఇప్పుడు వరుసగా హరీష్ శంకర్ డైరెక్షన్ లో ఉస్తాద్ భగత్ సింగ్,( Ustaad Bhagat Singh ) ఓజీ( OG ) లాంటి సినిమాలు చేస్తున్నాడు ఇక ఈ సినిమాలు దాదాపు రిలీజ్ కి రెడీ అయ్యే విధంగా కనిపించినప్పటికీ ఆంధ్ర లో ఎలక్షన్స్ ఉండడంతో ఈ సినిమా రిలీజ్ అనేది పోస్ట్ పోన్ అయింది.ఇక ఇప్పుడు తెలుస్తున్న విషయం ఏంటంటే
పవన్ కళ్యాణ్ నెక్స్ట్ మరో సినిమాని అనౌన్స్ చేయనున్నాడు సురేందర్ రెడ్డి( Surendar Reddy ) డైరెక్షన్లో చేసే విధంగా కనిపిస్తున్నాడు ఇప్పటికే ఈ సినిమా ఎప్పుడో అనౌన్స్ చేయాల్సి ఉండాల్సింది కానీ ఇప్పుడు అఫీషియల్ గా అనౌన్స్ చేసే పనిలో ప్రొడ్యూసర్లు, డైరెక్టర్ ఉన్నట్టుగా తెలుస్తుంది.అయితే ఇక ఎలక్షన్స్ తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ లాంటి సినిమాలు రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్ళబోతున్నట్టు గా తెలుస్తుంది.అయితే ఈలోపు సురేందర్ రెడ్డి మరో యంగ్ హీరోతో మరొక సినిమా చేసి పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్లాలని చూస్తూన్నాడు అయితే ఇప్పటికే ఏజెంట్ సినిమాతో భారీ ఫ్లాప్ నందు సురేందర్ రెడ్డి ఇప్పుడు మరొక సినిమా చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది…
.