పవన్ కళ్యాణ్ అటు రాజకీయాలతో పాటు సినిమాలు కూడా చేస్తూ రెండింటిని చక్కగా బాలన్స్ చేస్తున్నాడు.ఇంకా ఎన్నికలకు చాలా సమయం ఉన్నందున వీలైనన్ని సినిమాలు చేయాలనీ పవన్ అనుకుంటున్నాడు.
అందుకే ఎప్పుడూ లేనంత ఫాస్ట్ గా సినిమాలను పూర్తి చేస్తున్నాడు.ఈ మధ్యనే పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమా విడుదల అయ్యి సూపర్ హిట్ అయ్యింది.
అజ్ఞాతవాసి సినిమా తర్వాత పవన్ మళ్ళీ వెండితెర మీద కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవు.వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది.
అంజలి, నివేతా థామస్, అనన్య ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు.ఈ సినిమా తర్వాత పవన్ వరస పెట్టి సినిమాలు చేస్తున్నాడు.ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి.
ప్రస్తుతం పవన్ క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమాలో నటిస్తున్నాడు.

అంతేకాదు రానాతో కలిసి రీమేక్ సినిమాలో కూడా నటిస్తున్నాడు.ఈ సినిమాలతో పాటు పవన్ హరీష్ శంకర్ డైరెక్షన్ లో కూడా ఒక సినిమా ఒప్పుకున్నాడు.ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన గబ్బర్ సింగ్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిన విషయమే.అందుకే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా పెరిగాయి.
అయితే ఈ సినిమా గురించి ఇప్పుడు ఒక రూమర్ వినిపిస్తుంది.ఈ సినిమాను ఆగస్టు నుండి మొదలు పెట్టడానికి హరీష్ శంకర్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.

అంతేకాదు పవన్ కళ్యాణ్ ఈ సినిమా కోసం నెలకు 10 రోజుల చొప్పున డేట్స్ కూడా ఇచ్చాడని తెలుస్తుంది.ఈ సినిమాలో పవన్ డ్యూయెల్ రోల్ చేయబోతున్నాడు.తండ్రి, కొడుకు రెండు పాత్రల్లో కూడా పవన్ నటించబోతున్నాడు.ఈ సినిమాలో తండ్రి పాత్ర ఐబీ ఆఫీసర్ గా ఉంటుందట.